రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాలో జూన్ 1 న ముఖ్యమంత్రి రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. చాలా మంది రైతులు, రైతు భరోసా తో పాటు PM కిసాన్ నిధుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. అయితే మీకోసం ముఖ్యమైన అప్డేట్.
ప్రస్తుతానికి రైతు భరోసా మాత్రమే
ఈ సారి రైతు భరోసా తొలి విడత సహాయం కింద ₹5500 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మిగిలిన ₹2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. కావున ప్రస్తుతం రైతులకు 5500 మాత్రమే జమ అవుతుంది.
రైతు భరోసా పడిందా లేదా స్టేటస్ ఎలా చూడాలి
వైఎస్సార్ రైతు భరోసా సంబంధించి కింది లింక్ లో మీ 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేసి రైతు భరోసా 2023-24 స్టేటస్ ను తెలుసుకోవచ్చు
ముఖ్య గమనిక: మీకు స్టేటస్ లో ‘Payment Under Processing ‘ అని ఉంటే ఒకటి లేదా రెండు రోజుల్లో మీ ఖాతాలో అమౌంట్ జమ అవుతుంది. ఆ తరువాత Payment Succes అని మారుతుంది
కర్నూలు జిల్లా పత్తికొండ పర్యటనలో భాగంగా జూన్ ఒకటవ తేదీన ముఖ్యమంత్రి రైతు భరోసా నిధులను విడుదల చేయడం జరిగింది. మొత్తం 52.39 లక్షల మంది రైతుల ఖాతాలో 5500/- చొప్పున రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది.
Leave a Reply