ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ ఏడాది రెండో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవంబర్ 7న విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.
ఆ తర్వాత నవంబర్ 15వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ 15వ ఇన్స్టాల్మెంట్ నిధులను విడుదల చేయడం జరిగింది.
అయితే తాజా సమాచారం ప్రకారం పీఎం కిసాన్ నిధులు ఇప్పటికే చాలామంది రైతుల ఖాతాలో జమ అవ్వగా, రైతు భరోసా నిధులు మాత్రం పది రోజులు గడుస్తున్నా ఇంకా జమ కాలేదని కొందరు రైతులు పేర్కొంటున్నారు. మరి కొంత మంది రెండు పడలేదు అని అంటున్నారు.
ఈ విడతలో భాగంగా పీఎం కిసాన్ 2000, రైతు భరోసా 2000 మొత్తంగా 4000 రూపాయలు రైతుల ఖాతాలో జమ కావాల్సి ఉంటుంది.
ఇంతకీ రైతు భరోసా అమౌంట్ మరియు pm కిసాన్ అమౌంట్ పడ్డాయా, లేదా? ఎంతమందికి ఇంకా పడలేదు అనే విషయాలను తెలుసుకునేందుకు కింద ఒక ఆన్లైన్ పోల్ నిర్వహిస్తున్నాము.
ఈ పోల్ లో భాగంగా ఒకవేళ మీ ఖాతాలో రైతు భరోసా అమౌంట్ పడినట్లయితే పడింది అని ఒకవేళ పిఎం కిసాన్ మాత్రమే పడితే పడింది అని రెండు పడితే రెండు పడ్డాయని ఎంచుకోండి. ఈ ఆన్లైన్ పోల్ రైతుల అవగాహన కోసం మాత్రమే. ఖచ్చితమైన సమాచారం కోసం మీ సమీప సచివాలయంలో లేదా రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించండి. పీఎం కిసాన్ సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయండి.
ఇక PM కిసాన్ మరియు రైతు భరోసా స్టేటస్ కోసం కింది లింక్స్ పై క్లిక్ చేయండి.
Leave a Reply