తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు రైతు భరోసా పథకానికి సంబంధించి మరియు దాని అమలుకు సంబంధించి క్లారిటీ ని ఇచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారా అని ఎదురు చూస్తున్నా రైతాంగానికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
అయితే ఈసారి 15000 ఇస్తామని తెలిపినటువంటి ప్రభుత్వం 12,000 కే అమౌంట్ ను కుదించింది.
ఈ నెల 26 నుంచి రైతు భరోసా
జనవరి 26 2025 న రైతు భరోసా పథకాన్ని (Rythu Bharosa Telangana) ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రచురించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం రోజున పురస్కరించుకొని ఈ రోజున మూడు పథకాలకు శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
జనవరి 26 న రైతు భరోసా అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈసారి రైతు భరోసా అమౌంట్ @12 వేలు
అయితే ఎన్నికల సమయంలో 15000 ఎకరాకు ఇస్తామని తెలిపినటువంటి ప్రభుత్వం ఇకనుంచి 12,000 ఇవ్వనున్నట్లు తెలిపింది. రాష్ట్ర ఆర్థిక భారం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కడకు 12000 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉంటే అంత మందికి రైతు భరోసా అనేది వర్తిస్తుంది. అయితే సాగు భూమి ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
గుట్టలు పుట్టలు మరియు సాగులో లేని భూమి మైనింగ్ భూములకు తాము రైతు భరోసా ఇవ్వబోమని మరోసారి స్పష్టం చేశారు.
కౌలు రైతులకు 12000 మరో కొత్త పథకం
అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి కౌలు రైతులకు ప్రతి ఏటా 12 వేల రూపాయలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో అందించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
26 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు
పైన పేర్కొన్న రెండు పథకాలతో పాటు జనవరి 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియను ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా రైతాంగానికి మరియు రేషన్ కార్డు లేనివారికి ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు పథకాలను 26 న ప్రారంభిస్తుంది.
Leave a Reply