Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్..రైతు బంధు పోర్టల్ ఓపెన్ అయింది, ఇలా అప్లై చేయండి

Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్..రైతు బంధు పోర్టల్ ఓపెన్ అయింది, ఇలా అప్లై చేయండి

తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సహాయానికి అప్లై చేసుకునేందుకు రైతు బంధు పోర్టల్ ఎట్టకేలకు తెరుచుకుంది.

ప్రస్తుతం రైతుబంధు పోర్టల్ ద్వారా ఎవరు అప్లై చేసుకోవచ్చు

గత ఏడాది పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి రైతులకు యాసంగిలో రైతుబంధు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రైతుబంధు [Rythu Bandhu] పోర్టల్ తెరుచుకోకపోవడంతో రైతులు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎట్టకేలకు రైతుబంధు సైట్ తెరుచుకుంది.

గత ఏడాది డిసెంబర్ 20 వరకు పట్టాదార్ పాస్ పుస్తకం పొందినటువంటి రైతులకు ప్రస్తుతం రైతుబంధు పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది.

ఇక డిసెంబర్ తర్వాత భూబదలాయింపు చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి కూడా త్వరలోనే అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇక రైతుబంధు సహాయం ఎప్పుడంటే?

మరో వారం రోజుల్లో రైతుబంధు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి ఏటా రెండు సీజన్లలో ఐదు వేల రూపాయలు చొప్పున మొత్తం పదివేల రూపాయలను రైతు బంధు ద్వారా రైతుల ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే. తొలుత తక్కువ భూమి ఉన్న వారికి ఆ తర్వాత ఎక్కువ భూమి ఉన్న వారికి అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. మొత్తం పది రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

రైతుబంధు కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అర్హత ఉన్నటువంటి రైతులు తమ ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకం, బ్యాంక్ పాస్ బుక్ తీసుకొని మీ పరిధిలో ఉన్నటువంటి ఏఈఓ ని సంబంధిత కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తులు సమర్పించవచ్చు.

జిల్లాలు మండలాల వారిగా ఏఈఓ లిస్ట్ కింది లింక్ ద్వారా చెక్ చేయండి

You cannot copy content of this page