రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు పోర్టల్ లో గత డిసెంబర్ 22వ తేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులకు కొత్తగా నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. వీరితోపాటు పాతవారికి సవరణలకు సంబంధించి కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
ఏ ఏ సవరణలకు అవకాశం ఇచ్చారు
రైతుబంధు పోర్టల్ ద్వారా ఎవరైనా వ్యక్తులు తమ బ్యాంకు వివరాలను మార్చుకోవాలనుకుంటే ఇందుకు ప్రస్తుతం అవకాశం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా మొబైల్ నెంబర్ మార్చుకోవాలి అన్నా కూడా ప్రస్తుతం ఇవ్వడం జరిగింది.
ఏఈవో లాగిన్ లో ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. రైతులు పంట రుణ ఖాతా కాకుండా ఇతర బ్యాంక్ ఖాతా ను లింక్ చేసుకునే సదుపాయం కల్పించడం జరిగింది.
కొత్త నమోదు కు అవకాశం
గత ఏడాది డిసెంబర్ 22 వరకు డిజిటల్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు తమ వివరాలను వ్యవసాయ కార్యాలయాలలో ఉండే ఏఈవొ లకు అందిస్తే వాటిని నమోదు చేస్తున్నారు. ఇప్పటికే రైతు బంధు పొందుతున్న వారు ఎటువంటి వివరాలను మరలా ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే బ్యాంక్ ఖాతా లేదా మొబైల్ నంబర్ మార్చుకునే వారు మాత్రం ఏఈవొ లను సంప్రందించవచ్చు.
ఇక ఈ ఏడాది కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారికి ఇంత వరకు నమోదు ఆప్షన్ కల్పించలేదు. త్వరలో కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇక మరో వారం రోజుల్లో రైతు బంధు సహాయాన్ని అందించే షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.
Leave a Reply