ఈరోజు లోపు రైతుబంధు లబ్ధిదారుల వివరాలను పోర్టల్ లో సిద్ధం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది.
యాసంగి రైతుల వివరాలు ఆధారంగా రైతులను ప్రస్తుత సీజన్ కి కూడా అందుబాటులో ఉంచేలా చూడాలని, కొత్తగా అప్లై చేసుకున్న వారితో పాటు ఇటీవల పోడు భూములు పంపిణీ చేసిన రైతులకు సంబంధించి కూడా రైతుబంధు అందేలా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఇక ఈనెల 16 నాటికి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ పూర్తయి, పాస్‌బుక్ పొందిన వారు కొత్తగా రైతుబంధుకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు భారీ స్థాయిలో జిల్లాల్లో రైతుల నుంచి AEOలు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఈనెల 24న సీఎం కెసిఆర్ 1.50 లక్షల మందికి పోడు భూములు పంపిణీ చేస్తుండగా, వారికి కూడా రూ.5వేల సాయం అందనుంది. ఈ నెల 26 నుంచి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు.
జూన్ 26 నుంచి రైతు బంధు
రైతుబంధు ఖరీఫ్ సీజన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 26 నుంచి జమ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రతి ఎకరాకు 5000 చొప్పున రైతుల ఖాతాలో నేరుగా అమౌంట్ ని రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.
మొత్తం పది రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ముందుగా ఎకరం పొలం ఉన్నవారికి నిధులు జమ చేస్తారు ఆ తర్వాత రెండు ఎకరాలు ఆ తర్వాత అంతకంటే ఎక్కువ ఉన్నవారికి ప్రాధాన్యత క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ ని విడుదల చేస్తుంది.
Rythu Bandhu 2023 Release Date : 26.06.2023
ఇక పొడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత పోడు భూముల రైతులకు కూడా రైతుబంధు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
ముమ్మరంగా రైతుబంధు కొత్త రిజిస్ట్రేషన్స్ మరియు సవరణలు
ఈ నెల 16 వరకు పట్టాదార్ పాస్ పుస్తకం పొందినటువంటి రైతుల నుంచి జిల్లా స్థాయిలో ముమ్మరంగా దరఖాస్తులు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ తో పాటు సవరణలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు ఏఈవో ల లాగిన్ లో అవకాశం ఇచ్చారు. రైతుబంధు లబ్ధిదారులు తమ బ్యాంకు పాస్ పుస్తకం లేదా మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసుకునే ఆప్షన్ కూడా ప్రస్తుతం కల్పించడం జరిగింది.
Leave a Reply