తెలంగాణలో రెండో రోజు 1,278 కోట్ల నిధులను జమ చేసిన ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల్లో 39 లక్షల మందికి అమౌంట్
వర్షాకాలం ఖరీఫ్ పంటకు సంబంధించి రైతుబంధు పంట సహాయం నిధులను సోమవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం అనగా రెండో రోజు రూ.1,278 కోట్ల నిధులను 16.98 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఇప్పటి వరకు రెండు రోజుల్లో కలిపి 39,54,138 మంది రైతుల ఖాతాల్లో రూ.1,921 కోట్లు జమ చేయడం జరిగింది. మొత్తం 38.42లక్షల ఎకరాలకు ఇప్పటి వరకు రైతుబంధు సాయం అందింది. రైతుబంధు ద్వారా తెలంగాణలో సాగు విప్లవం కొనసాగుతుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మందికి అమౌంట్
ఈ ఏడాది 70 లక్షల మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు.
ఈ ఏడాది వాన కాలం సీజన్ నాటికి కొత్తగా ఐదు లక్షల మంది కొత్త రైతులు నమోదు అయినట్లు ప్రభుత్వం తెలిపింది. మరో లక్షన్నర మంది పోడు భూముల రైతులకు కూడా ఈ సీజన్ నుంచి రైతుబంధు వర్తింప చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
జూన్ నెల 16 నాటికి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ పూర్తయి, పాస్‌బుక్ పొందిన వారందరికీ కొత్తగా రైతుబంధు రైతుబంధుకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.
11వ విడత లో భాగంగా మొత్తం 7,720.29 కోట్లను ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో జమ చేయనుంది. గతేడాది తో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 300 కోట్లు ప్రభుత్వంపై భారం పడినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
Rythu Bandhu 2023 Release Date :From 26.06.2023
తెలంగాణ సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద ఇవ్వబడిన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి
Leave a Reply