గ్రామ వార్డు వాలంటీర్లు ఇప్పటి వరకు రైస్ కార్డు e-KYC ను AEPDS మొబైల్ అప్లికేషన్ లో చేసే వారు. కానీ గత కొంత కాలం గా రైస్ కార్డు లు సచివాలయం లో ఆన్లైన్ అవుతున్నప్పటికి eKYC చేయు మొబైల్ అప్లికేషన్ AEPDS సరిగా పని చెయ్యక పోవటం జరుగుతున్నది.GSWS డిపార్ట్మెంట్ వారు కొత్తగా రైస్ కార్డుల eKYC కొరకు వాలంటీర్లు హౌస్ హోల్డ్ మాపింగ్ కోసం ఉపయోగిస్తున్న GSWS Volunteers (గతం లో గ్రామ వార్డు వాలంటీర్) లో కొత్తగా ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
అప్లికేషన్ లో లాగిన్ అవ్వాలి అంటే వాలంటీర్ల ఆధార్ నెంబర్ తో అవ్వాలి. గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ వారి వద్ద ఉన్న ఆధార్ నెంబర్ తో మాత్రమే లాగిన్ అవుతుంది. కొత్తగా జాయిన్ అయిన వాలంటీర్ వారికి లాగిన్ అవ్వక పోతే అప్పుడు వారి వివరాలు MPDO/MC వారి apgv.apcfss లాగిన్ లో అప్డేట్ చేయాలి. అప్పుడు లాగిన్ అవుతుంది. లేకపోతే “AADAR NOT REGISTERED WITH THE DEPARTMENT” అని వస్తుంది.
ఈ కొత్త ప్రాసెస్ లో మొత్తం మూడు రకాల రైస్ కార్డు సర్వీస్ అందుబాటులో ఉంటాయి.
- e-KYC
- Child Declaration
- Death Declaration
GSWS VOLUNTEER మొబైల్ అప్లికేషన్ లో e-KYC చేయు విధానం :
- అప్లికేషన్ లో వాలంటీర్ ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి.
- హోమ్ పేజీ లో “Service Request” అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
- “RICE CARD EKYC” ను ఎంచుకోవాలి.
- Search Application లో T నెంబర్ ఉంటే Application No లేదా రైస్ కార్డు నెంబర్ ఉంటే Rice Card No. ను ఎంచుకోని ‘SUBMIT’ పై క్లిక్ చేయాలి.
- Pending అని ఉన్న ఉంటే దానిపై క్లిక్ చేయాలి.
- EKYC,CHILD EKYC, DEATH లో ఒకటి ఎంచుకోవాలి.
- Conditions టిక్ చేసి Biometric / Irish తో Authentication చేయాలి.’Completed’ అని వస్తే పూర్తి అయినట్టే.
Leave a Reply