సాధ్యమైనంత ఎక్కువ మంది వాస్తవ సాగుదారులకు సంక్షేమ ఫలాలు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులు మరియు దేవాదాయ భూముల సాగుదారులకు రైతు భరోసా సహాయం అందిస్తుంది.
భూ యజమానులకు నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు (వాస్తవ సాగుదారులు) పంట సాగుదారు హక్కు పత్రాల (సీసీఆర్‌సీ)ను జారీ చేసింది.
వరుసగా ఐదో ఏడాది కూడా కౌలు రైతులతోపాటు దేవదాయ భూములు సాగు చేసే వారికి వైఎస్సార్ రైతు భరోసా అందించేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవల వీరి నుంచి కొత్త రిజిస్ట్రేషన్లు స్వీకరించిన ప్రభుత్వం, వాటిని పరిశీలించి ccrc కార్డుల జారీ మరియు రైతు భరోసా నమోదు ను చేపట్టింది.
సీఆర్సీలు పొందిన వారిలో అర్హులైన 1,42,693 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులతో పాటు 3,631 మంది దేవదాయ భూముల సాగుదారులకు వైఎస్సార్ రైతు భరోసా కింద తొలి విడతగా రూ.7,500 చొప్పున రూ.109.74 కోట్లు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఈ నెల 31న తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు.
Also Read
- ఏపీలో కౌలు రైతులకు గుడ్ న్యూస్, రైతు భరోసా కొత్త దరఖాస్తులకు అవకాశం, ఇలా అప్లై చేయండి
- YSR Rythu Bharosa Amount Released వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభం
ఇది చదవండి: వంట గ్యాస్ పై ₹200 తగ్గించిన కేంద్రం
Leave a Reply