గ్రామ వార్డు సచివాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి సూచనలు జారీ

‘దేశవ్యాప్తముగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ది. 26/01/2023 నాడు నిర్వహించబడుతున్నందున

రాష్ట్రములోని అన్ని గ్రామ/వార్డు సచివాలయములలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించు నిమిత్తము

గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బందికి ఈ దిగువ తెలుపబడిన సూచనలు జారీ చేయడమైనది.

రాష్ట్రములోని అన్ని గ్రామ/వార్డు సచివాలయములలో తప్పనిసరిగా ఉదయం 9 గంటలకు జాతీయ
పతాకావిష్కరణ నిర్వహించవలసి యున్నది. కావున సంబధిత పంచాయతి కార్యదర్శులు మరియు వార్డు
అడ్మినిస్ట్రేటివ్‌ కార్యదర్శులు వారి వారి సచివాలయములలో _ విధిగా సదరు పతాకావిష్కరణను
జరుగునట్లుగా చూడవలయును.

జాతీయపతాక _ ఆవిష్కరణకు సచివాలయ పరిధిలో గల _ ఎన్నికకాబడిన ప్రజాప్రతినిధులను
ఆహ్వానించవలెను.

ప్రస్తుతమున్నకోవిడ్‌ – 19, ఒమిక్రాన్‌ పరిస్థితుల దృష్ట్యా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ
వారిచే జారీచేయబడిన నిబంధనలను పరిగణలోనికి తీసుకొని తగు జాగ్రత్తలు పాటించవలయును
గణతంత్ర దినోత్సవ దినోత్సవ వేడుకలు హాజరగువారు తప్పని సరిగా మాస్కును ధరించునట్లుగా
చూడవలయును. చేతులకు శానిటైజేషన్‌ నిర్వహించవలెను

గణతంత్ర దినోత్సవ దినోత్సవ వేడుకలు నిర్వహించు ప్రదేశములలో శానిటైజేషన్‌ నిర్వహించవలెను
పతాకావిష్కరణ చేసిన తదుపరి గణతంత్ర దినోత్సవ దినోత్సవ వేడుకలు ప్రాముఖ్యత, దేశసార్వభౌమ,
సమగ్రతనుగురించిప్రజలకు వివరించవలయును.

  • ఆంధ్ర ప్రభుత్వము వారిచే సంక్షేమ క్యాలెండరు ప్రకారము _ అమలుకాబడుతున్న వివిధ సంక్షేమ
    కార్యక్రమముల గురించి వివరించవలెను మరియు సదరు పథకముల క్రింద లబ్దినిపొందిన వారివివరములను
    తెలియచేయవలయును.
  • గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గౌ. ముఖ్యమంత్రి వారిచే ప్రారంభించుబోవు కార్యక్రమములను
    ప్రజలకు టెలీకాస్టు చేయు నిమిత్తము ప్రతి సచివాలయము వద్ద తగు ఏర్పాట్లను సంబంధిత పంచాయతి
    కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ కార్యదర్శి చేయవలయును.

= గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతముగా నిర్వహించుటలో గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది
మరియు వాలంటీర్లు అందరూ పూర్తిగా పంచాయతి కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ కార్యదర్శివారికి పూర్తి
సహకారాన్ని అందించవలెను.

పైసూచనలు విధిగా అందరు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది విధిగా పాటించునట్లుగా వారికి
తగు సూచనలు జారీచేయవలసినదిగా అందరు జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు ( 1/1//5 &0),
జిల్లా ప్రజా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారులు, జిల్లాపంచాయతిఅధికారులు, మునిసిపల్‌
కమిషనర్లు, _ డివిజినల్‌ డెవవలెప్‌ మెంట్‌ అధికారులు, మండల _ పరిషత్‌ అభిఫృద్ది
అధికారులనుకోరడమైనది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page