రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి సామాన్యులకు షాక్ ఇచ్చింది.
వరుసగా ఐదో సారి రేపో రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
గత డిసెంబర్ లో జరిగిన ద్రవ్య పరపతి సమీక్ష లో భాగంగా 35 బేసిస్ పాయింట్లు పెంచిన RBI తాజా గా ద్వేమాసిక పరపతి సమీక్ష లో భాగంగా మరో 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఈ నిర్ణయం తో రుణాల పై వడ్డీ మరింత పెరగనుంది. ఇప్పటికే గృహ రుణాలు, పర్సనల్ లోన్స్ పై వడ్డీ రెట్లు పెరగగా తాజా నిర్ణయం తో ఇక సామాన్యులు రుణం తీసుకోవాలి అన్నా లేదా వడ్డీ చెల్లించాలి అన్నా కష్ట తరం కానుంది.
ఇప్పటికే కొన సాగుతున్న పలు దీర్ఘకాలిక గృహ రుణాల పై కూడా వడ్డీ పెరగనుంది.
అసలు రేపో రెట్ అంటే ఏమిటి?
బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలను ఇస్తుంది. నిర్దిష్ట వడ్డీ కి ఈ రుణాలను ఇస్తుంది. ఈ వడ్డీ రేటు నే రేపో రేటు అంటారు. దీనిని దేశ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు RBI సవరిస్తూ ఉంటుంది. ఈ వడ్డి ని బేసిస్ పాయింట్ల రూపంలో పెంచడం లేదా తగ్గిస్తూ ఉంటారు.
Leave a Reply