రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేట్ల కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారీ repo rate ను యధాతధంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.
గత ఏడాది మే నుంచి రేటు ను వరుసగా పెంచుకుంటూ వస్తున్న ఆర్బిఐ , ఈసారి 6.50 వద్ద రేపో రేటు ను పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
దైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష లో భాగంగా జరిగిన సమావేశంలో Monetary policy committee ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఈసారి మరో 25 బేసిస్ పాయింట్ల మేర రేపో రేటు ను పెంచుతారని భావించినప్పటికీ ఇందుకు భిన్నంగా యధాతధంగా రేటు ను కొనసాగించింది.
బ్యాంక్ డిపాజిట్ మరియు లోన్ రేట్ల పై ప్రభావం ఎలా ఉంటుంది?
సాధారణంగా రేపో రేటు పెరిగితే బ్యాంకులు డిపాజిట్ల పై, రుణాల పై వడ్డీ రెట్లను పెంచుతాయి. అయితే తాజా నిర్ణయం తో బ్యాంకులు ఈ రేట్ల ను పెంచే అవకాశం తక్కువ.
ఇప్పటికే వరుసగా ఆయా బ్యాంకులు డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే.
అత్యదిక వడ్డీ చెల్లిస్తున్న టాప్ ప్రభుత్వ బ్యాంకులు కింది లింక్స్ లో చూడవచ్చు.
Leave a Reply