తెలంగాణలో రేషన్ ఈ కేవైసీ గడువు సమీపిస్తుందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రేషన్ దుకాణాలకు వెళ్లి తమ ఈ కేవైసీ విధిగా పూర్తి చేసుకోవాలని, లేనిపక్షంలో రేషన్ కార్డు నుంచి వారి పేర్లు తొలగించడం జరుగుతుందని ఇటీవల మీడియాలో ఎన్నో కథనాలు రావడం జరిగింది. దీనిపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ క్లారిటీ ఇచ్చారు.
ఎటువంటి చివరి తేదీని ప్రకటించలేదు, పుకార్లను నమ్మొద్దు
తెలంగాణలో రేషన్ ఈకెవైసి కొరకు ఎటువంటి చివరి గడువును తాము ప్రకటించలేదని రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మీడియాకు తెలిపారు.
రేషన్ కు ఈ కేవైసి పూర్తి చేయాలనే నిబంధన కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే అపోహలు సృష్టిస్తుందని రాష్ట్రప్రభుత్వం ఎటువంటి డెడ్లైన్ విధించలేదని మంత్రి తెలిపారు.
జనవరి వరకు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చివరి తేదీని ప్రకటించినట్లుగా మీడియాలో వచ్చే కథనాలను ఆయన ఖండించారు. రేషన్ ఈ కేవైసీ సంబంధించి వస్తున్న సమస్యలను నివేదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసినట్లు మంత్రి వెల్లడించారు.
Leave a Reply