దేశంలోని నకిలీ రేషన్ కార్డులను గుర్తించడానికి రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మార్చి 31 గా ఇదివరకు జారీ చేసిన ఉత్తర్వులలో తెలిపింది. అయితే ఇప్పటికీ చాలామంది రేషన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసుకోని కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మార్చి 31 తో ముగియనున్న గడువును మరో మూడు నెలలు అంటే జూన్ 30 వరకు గడువును పొడిగించింది.
ఇప్పటికీ రేషన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసుకోని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వెంటనే వారి రేషన్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని తెలిపింది. అందుకుగాను రేషన్ షాప్ ను సందర్శించవచ్చు లేదా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వెబ్సైట్ లింకును సందర్శించాలని సూచించింది.
Leave a Reply