నిరుద్యోగులకు 4 లక్షలు, రాజీవ్ యువ వికాసం ప్రారంభం

, ,
నిరుద్యోగులకు 4 లక్షలు, రాజీవ్ యువ వికాసం ప్రారంభం

రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం నుంచి లాంచనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల కోసం తీసుకువచ్చినటువంటి ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం..

50వేల నుంచి పది లక్షల సహాయం – Rajeev Yuva Vikasam Eligibility and Benefits

రాజీవ్ యువ వికాసం పథకం కింద నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగులకు మూడు క్యాటగిరీలలో రుణం వినిపించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో 6 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం “రాజీవ్ యువ వికాసం” కార్యక్రమాన్ని చేపట్టిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన ఎన్ని ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుంది.

కేటగిరి-1 కింద రూ. లక్ష వరకు రుణం.. 80 శాతం రాయితీ.
కేటగిరీ-2 కింద రూ. 2 లక్షల వరకు సాయం.. 70 శాతం రాయితీ.
కేటగిరీ-3 కింద రూ.3 నుంచి 4  లక్షల వరకు సాయం 60 శాతం రాయితీ ఇవ్వనుంది.

ఇందుకోసం ప్రభుత్వం 6 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

రాజీవ్ యువ వికాస్ అప్లికేషన్ ప్రాసెస్ మరియు తేదీలు – Rajeev Yuva Vikasam Application process and dates

రాజీవ్  యువ వికాస్  పథకానికి సంబంధించి మార్చ్ 17  నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఏప్రిల్ 6 నుంచి మే 30 వరకు లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల కేటాయింపు ప్రక్రియ చేపడతారు.

అర్హులైన యువతీ యువకులను ఎంపిక చేయడానికి ప్రజా ప్రతినిధులు మండలాల వారిగా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 4 నుంచి 5 వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ప్రకటించింది.

జూన్ 2 వ తేదీన 5 లక్షల మంది లబ్దిదారులను ప్రభుత్వం ప్రకటించనుంది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page