Pradhan Mantri Garib Kalyan Anna Yojana – ఆగస్టు 1 నుంచి ఉచిత బియ్యం

Pradhan Mantri Garib Kalyan Anna Yojana – ఆగస్టు 1 నుంచి ఉచిత బియ్యం

ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఉచిత బియ్యం పంపిణీ…

గత నాలుగు నెలల పెండింగ్ బియ్యం కలుపుకొని నలుగురు ఉండే కుటుంబానికి 100 కిలోలు చొప్పున అందునున్న బియ్యం.

ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) అనేది భారత ప్రభుత్వం మార్చి 26 2020న ప్రకటించిన ఆహార భద్రత సంక్షేమ పథకం, భారతదేశంలో COVID-19 మహమ్మారి సమయంలో భారతదేశంలోని అత్యంత పేద పౌరులకు, అన్ని ప్రాధాన్యత గల కుటుంబాలకు (రేషన్ కార్డ్ హోల్డర్‌లు మరియు అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా గుర్తించబడిన వారికి) ఆహారం అందించడం ఈ పథకం లక్ష్యం. ఇందుకోసం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ధాన్యాన్ని అందించడం జరుగుతుంది.

PMGKAY ద్వారా ఏమి పంపిణి చేస్తారు?

PMGKAY ద్వారా ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం లేదా గోధుమలను (ప్రాంతీయ ఆహార ప్రాధాన్యతల ప్రకారం) మరియు రేషన్ కార్డ్ కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి 1 కిలో పప్పును అందిస్తుంది. ఈ సంక్షేమ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమంగా గుర్తించబడింది.

ఎప్పటివరకు పంపిణి చేస్తారు?

ఈ కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 2020 నుంచి పలు మార్లు పొడిగిస్తూ ప్రస్తుతం సెప్టెంబర్ 2022 వరకు ఉచిత రేషన్ ను పంపిణి చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ఏపీ మరియు తెలంగాణ లో పంపిణి ఎలా ఉంది ?

తెలంగాణ లో ప్రతి నెల రేషన్ దుకాణాల నుంచి ఈ పంపిణి చేస్తున్నారు. ఏపీ లో మార్చ్ వరకు నెలలో 15 వ తేదీ నుంచి నెలాఖరు వరకు పంపిణి చేశారు. అయితే ప్రస్తుతం 4 నెలల పెండింగ్ రేషన్ ఆగస్టు నుంచి కూపన్ల వారీగా పంపిణి చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page