PPF – Public Provident Fund పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అనేది దీర్ఘకాల(long term) పెట్టుబడి కి ప్లాన్ చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఒక పొదుపు పథకం. దీనిని ఒక ఖాతా రూపంలో తెరుస్తారు. PPF ఖాతాను మీరు ఏదైనా బ్యాంక్ ద్వారా కానీ లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా అయినా ఓపెన్ చేయవచ్చు.
భారత దేశంలో ఉండే ఏ పౌరుడైన ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
ఈ ఖాతా కింది మూడు అంశాలతో పెట్టుబడి దారులకు మంచి లాభం చేకూరుస్తుంది.
- దీర్ఘకాలిక [Long Term] పెట్టుబడి
- అధిక వడ్డీ ( ప్రతి ఏటా వడ్డీ అసలు లో జమ )
- పన్ను రాయితీ
ఈ పథకం కాల్యవ్యవధి ఎంత ? ఏటా ఎంత జమ చేస్కోవచ్చు ?
ఈ పథకం లో మదుపు చేసే వాళ్ళు 15 ఏళ్ళ పాటు ప్రతి ఏటా సేవింగ్స్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏటా కనీయం 500 నుంచి 1.5 లక్షల వరకు ఖాతా లో జమ చేసుకోవచ్చు.
ఈ పథకం ద్వారా ఎంత వడ్డీ లభిస్తుంది ? వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు ?
ఈ పథకం ద్వారా జమ చేసే మొత్తం పై ప్రస్తుతం 7.1 % వడ్డీని కేంద్రం జమ చేస్తుంది.
అంతే కాదు, ప్రతి ఏటా వడ్డీ ని అసలు మొత్తంలో జమ చేస్తుంది. తద్వార లబ్దిదారులకు వడ్డీ పై వడ్డీ లభించినట్లే అవుతుంది .
పన్ను రాయితీ లభిస్తుందా ?
ఈ పథకం ద్వారా ప్రతి ఏటా జమ చేసుకునే అమౌంట్ ను పన్ను రాయితీ కోసం 80C కింద ఖాతా దారులు చూపించవచ్చు.
1.5 లక్షల గరిష్ట అమౌంట్ వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అంతే కాదు, 15 ఏళ్ళ తరువాత అసలు మరియు వడ్డీ పై ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ముందస్తు ఉపసంహరణ(withdraw) ఆప్షన్ ఉంటుందా ?
లాక్-ఇన్-పీరియడ్ 15 సంవత్సరాలు అయినా 6 ఏళ్ల నిండిన తర్వాత 7 వ సంవత్సరం నుంచి పాక్షిక ఉపసంహరణ 50% వరకు అనుమతి ఉంటుంది. అయితే ఈ 50% అనేది మీరు 4 యేళ్లు పూర్తి చేసే సమయానికి ఉన్న అమౌంట్ లో సగం తీసుకోవచ్చు. ఈ విధంగా 7 వ ఏట నుంచి ప్రతి ఏటా పాక్షికంగా ఒకసారి withdraw చేసే సౌలభ్యం ఉంటుంది.
అంతే కాదు ప్రతి 5 ఏళ్లకోసారి అపరిమితంగా పొడిగించుకోవచ్చు కూడా.
ఖాతాను ముందు గా క్లోజ్ చేయవచ్చా ?
మెడికల్ లేదా చదువు నిమిత్తం కనీసం 5 సంవత్సరాల తర్వాత ఖాతాను ముందస్తు గా మూసివేసే ఆప్షన్ కూడా ఉంటుంది.
అంతే కాదు PPF ఓపెన్ చేసిన 3 నుంచి 6 ఏళ్ళ వ్యవధి సమయంలో ఈ ఖాతాపైన లోన్ కూడా పొందే సౌకర్యం ఉంది. అయితే లోన్ మొత్తం 25% మించకూడదు. ఈ పాతిక శాతం కూడా మీ ppf అకౌంట్ లో లోన్ తీసుకునే నాటికి రెండేళ్ల ముందు ఉన్న బ్యాలెన్స్ మొత్తం పైన ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఖాతా NRI కస్టమర్స్ కి వర్తించదు. ఈ ఖాతాను మైనర్ పేరు పైన ఓపెన్ చేయవచ్చు. అయితే మైనర్ కి 18 యేళ్లు వచ్చే వరకు గార్డియన్ ద్వారా ఖాతా నిర్వహించబడుతుంది.
ఈ విధంగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ పథకం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఒక మంచి పథకం
Leave a Reply