POTD Scheme : పోస్టాఫీసు టైం డిపాజిట్ స్కీమ్ గురించి విన్నారా? ఎక్కువ వడ్డీ మరియు పన్ను రాయితీ ఒకేసారి పొందవచ్చు

POTD Scheme : పోస్టాఫీసు టైం డిపాజిట్ స్కీమ్ గురించి విన్నారా? ఎక్కువ వడ్డీ మరియు పన్ను రాయితీ ఒకేసారి పొందవచ్చు

మనకి సాధారణంగా బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ లేదా టర్మ్ డిపాజిట్ గురించి బాగా తెలుసు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ తరహా లోనే పోస్ట్ ఆఫీస్ లో టైం డిపాజిట్ ఒకటి ఉందని మీకు తెలుసా? ఇప్పుడు చూద్దాం

అసలు పోస్టాఫీసు టైం డిపాజిట్ అంటే ఏమిటి?

Post office time deposit – ఇది ఫిక్స్డ్ డిపాజిట్ వలె పోస్టాఫీసు ద్వారా అందిస్తున్న ఒక పొదుపు స్కీమ్. ఇందులో డబ్బు పొదుపు చేసుకునే వారు ఒక సంవత్సరం లేదా రెండు, మూడు లేదా గరిష్టంగా 5 సంవత్సరాల వరకు ఏదో ఒక కాల వ్యవధి (tenure) ఎంచుకుని డిపాజిట్ చేయవచ్చు.

ఎంత వడ్డీ లభిస్తుంది

ఏడాది కాల వ్యవధి కి డిపాజిట్ చేసుకుంటే 6.8 % వడ్డీ, రెండేళ్ళకి 6.9% , మూడేళ్ల వ్యవధి ఎంచుకునే వారికి 7% ఇక ఎవరైతే గరిష్టంగా ఐదేళ్ల కాల వ్యవధికి డిపాజిట్ చేస్తారో వారికి ఏకంగా 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.

వడ్డీని ప్రతి ఏటా ఖాతాలో జమ చేస్తారు. ప్రతి త్రైమాసికంలో వడ్డీ ని లెక్కిస్తారు.

టైం డిపాజిట్ తెరవాలి అంటే అర్హతలు ఎంటి

పోస్ట్-ఆఫీస్ టైమ్ డిపాజిట్ (POTD) ఖాతా స్కీమ్‌ను కింది అర్హతలు ఉన్న ఏ వ్యక్తి అయినా తెరవవచ్చు.

✓ 18 ఏళ్లు పైబడిన ఏ భారతీయ పౌరుడు అయినా ఖాతా తెరవవచ్చు.

✓ ఇద్దరు వ్యక్తులు జాయింట్ గా తెరవవచ్చు – 10 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్లు వారి సంరక్షకుడి/తల్లిదండ్రులతో జాయింట్ గా ఖాతాను తెరవవచ్చు

టైమ్ డిపాజిట్ పై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందా?

ఐదేళ్ల కాల వ్యవధి ఉన్న డిపాజిట్ల పై 80C సెక్షన్ ద్వారా పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

POTD 5 Year term eligible for tax benefit

ముందస్తు ఉపసంహరణ ఆప్షన్ ఉందా?

కనీసం ఆరు నెలలు లాక్ ఉంటుంది. ఆ తర్వాత ముందస్తు మూసివేసే ఆప్షన్ ఉంటుంది. అయితే 5 ఏళ్ల డిపాజిట్ పై మాత్రం ఈ అవకాశం ఉండదు.

Click here to Share

One response to “POTD Scheme : పోస్టాఫీసు టైం డిపాజిట్ స్కీమ్ గురించి విన్నారా? ఎక్కువ వడ్డీ మరియు పన్ను రాయితీ ఒకేసారి పొందవచ్చు”

  1. John Wesley golusula Avatar
    John Wesley golusula

    Very good scheme.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page