Post office డిపాజిట్, సుకన్య సమృద్ధి లబ్ధిదారులకు ముఖ్య గమనిక

Post office డిపాజిట్, సుకన్య సమృద్ధి లబ్ధిదారులకు ముఖ్య గమనిక

పోస్ట్ ఆఫీస్ లో చిన్న మొత్తల పొదుపు చేస్తున్నటువంటి లబ్ధిదారులకు కీలక సూచనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది.

సెప్టెంబర్ 30లోగా ఆధార్ సీడింగ్ తప్పనిసరి

పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, సుకన్య సమృద్ధి యోజన, పిపిఎఫ్ వంటి చిన్న మొత్తాలలో పొదుపు చేస్తున్న వినియోగదారులు ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఆధార్ గాని సమర్పించనట్లయితే అటువంటివారు సెప్టెంబర్ 30 లోగా పోస్ట్ ఆఫీస్ లో తమ ఆధార్ ను లింక్ చేయించుకోవాల్సి ఉంటుంది.

ఏ ఏ పథకాలకు ఇది వర్తిస్తుంది

కింద ఇవ్వబడినటువంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ఇంకా ఇతర ఏమైనా పథకాలు మీరు తీసుకున్నట్లయితే వాటన్నిటికీ ఈ నిబంధన వర్తిస్తుంది.

  • పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)
  • పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ (RD)
  • పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (POMIS)
  • సుకన్య సమృద్ధి యోజన (SSY)
  • పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD)
  • మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
  • సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)
    కిసాన్ వికాస్ పత్ర (KVP)

ఏప్రిల్ 1న జారీ చేసినటువంటి ఉత్తర్వుల్లో భాగంగా ఆరు నెలల లోపు ఆధార్ లింక్ ని పూర్తి చేయాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ 30 చివరి తేదీగా ఉంది.

కింది కండిషన్స్ వర్తించే వారికి పాన్ కూడా తప్పనిసరి

ఆదాయపు పన్ను – Income Tax Rules 1962 ప్రకారం కింద నిబంధనలు వర్తించే వారు కూడా, ఈ నిబంధనలు వర్తించిన రెండు నెలల లోపు పాన్ కార్డు సంబంధిత పోస్ట్ ఆఫీస్ లో సమర్పించాల్సి ఉంటుంది.

  • తమ చిన్న ముత్యాల పొదుపు అకౌంట్లో ఏ సమయానికైనా 50,000 కంటే అదనంగా బ్యాలెన్స్ కలిగి ఉన్నచో పాన్ లేదా ఫార్మ్ 60 తప్పనిసరి.
  • ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని అకౌంట్లో ఉన్నటువంటి పూర్తి నగదు లక్ష రూపాయలు మించినచో ఇది వర్తిస్తుంది.
  • ఒక నెలలో ఒక అకౌంట్లో నగదు లావాదేవీలు లేదా ఉపసంహరణలు 10000 కు మించిన ఇది వర్తిస్తుంది.

ఆధార్ లేదా పాన్ లింక్ చేయకపోతే ఏమవుతుంది

ఆధార్ సెప్టెంబర్ 30 లోపు లింక్ చేయకపోయినా, పైన పేర్కొన్నటువంటి నిబంధనలు ఉన్నవారు పాన్ లింక్ చేయకపాయినా తాము పొదుపు చేస్తున్నటువంటి అకౌంట్స్ లో లావాదేవీలను తిరిగి ఆధార్ లేదా పాన్ సబ్మిట్ చేసే వరకు నిలిపివేయడం జరుగుతుంది. ఒకవేళ ఆధార్ కార్డు లేని వారు తాము అప్లై చేసినటువంటి అప్లికేషన్ వివరాలను సైతం సబ్మిట్ చేయవచ్చు. అయితే ఒరిజినల్ ఆధార్ నంబర్ ఆరు నెలల లోపు పోస్ట్ ఆఫీస్ లో తెలియజేయాల్సి ఉంటుంది. ఎవరికైతే ఆధార్ కార్డు ఇప్పటికే ఉంటుందో వారు తప్పనిసరిగా సెప్టెంబర్ 30 లోపు తమ ఆధార్ కార్డుని పోస్ట్ ఆఫీస్ లో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నిబంధనలు అన్నీ కూడా ఆధార్ లేదా పాన్ లింక్ చేయనటువంటి లబ్ధిదారులకు మాత్రమే.

Click here to Share

You cannot copy content of this page