తెలంగాణలో పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనులకు భూపడ్డాను ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిణీ చేశారు.
నాలుగు లక్షల పైగా ఎకరాల పోడు భూములకు పట్టాలు
రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కలుపుకొని 1,51,146 మంది బంజారా, ఆదివాసి గిరిజనుల కు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 4,06,369 ఎకరాల పోడు భూమిని వారికి పట్టాల రూపంలో ఇవ్వనుంది. ఈ మేరకు ఆ భూములపై సంపూర్ణ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది.
అడవి చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోనే గిరిజనులకు వారు సాగు చేసుకునే భూమిపై హక్కులను కల్పించడం జరిగింది. అయితే భూములను మాత్రం చూపించలేదు. అయితే ఈ సమస్యకు ప్రస్తుత ప్రభుత్వం పరిష్కారం చూపించడం జరిగింది.
అటవీ నీ నమ్ముకుని గిరిజన ప్రాంతాల్లో జీవించే ఆదివాసీలు మరియు బంజారాలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ భూ హక్కులను కల్పిస్తూ వారికి భూపత్రాలను అందించడం జరిగింది.
ముఖ్యమంత్రి పోడు భూములకు పట్టాల పథకాన్ని ప్రారంభించిన తర్వాత జిల్లాల వారిగా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పోడు భూములకు రైతుబంధు అమలు
పోడు భూములపై జీవిస్తున్నటువంటి గిరిజన రైతులకు మరింత మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వీరికి రైతుబంధును అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇందుకు సంబంధించి పోడు భూములను పంపిణీ చేసిన వెంటనే వీరికి నగదు కూడా జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో గిరిజన రైతులకు భూ హక్కుల తో పాటు పెట్టుబడి సహాయం కింద రైతుబంధు నిధులు కూడా జమ అవ్వడం జరిగింది.
Leave a Reply