గ్యాస్ వినయోగదారులకు గుడ్ న్యూస్.. దేశీయంగా గ్యాస్ ధరల మార్గదర్శకాలు సవరించిన మరుసటి రోజు కేంద్ర క్యాబినెట్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది.
CNG మరియు ధరలను స్థిరీకరించేందుకు, అంతర్జాతీయ ప్రతికూల హెచ్చుతగ్గులకు లోను కాకుండా వీటిపై క్యాప్ లేదా సీలింగ్ ను విధించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో PNG వంట గ్యాస్ మరియు CNG ధరలు 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
ప్రతికూల మార్కెట్ హెచ్చు తగ్గుల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
గత కొన్ని నెలల్లో CNG మరియు PNG రేట్లు 80% పెరగిన నేపథ్యంలో తాజా నిర్ణయం వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించవచ్చు.
Leave a Reply