దేశంలోని సీనియర్ సిటిజన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పెన్షన్ పథకమే PMVVY – ప్రధానమంత్రి వయా వందన యోజన పథకం.
ప్రధానమంత్రి వయ వందన యోజన పథకాన్ని 60 ఏళ్లు పైబడిన వాయోజనుల కోసం ప్రస్తుత ప్రభుత్వం 2017 లో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది.
అయితే ఈ పథకానికి మార్చి 31 2023 తో గడువు ముగుస్తుంది.
కాబట్టి నెలవారీ పెన్షన్ పొందాలనుకునే సీనియర్ సిటిజన్స్ , లేదా 60 యేళ్లు దాటిన తల్లిదండ్రులకు ఈ పథకాన్ని అందించాలనుకునేవారు మార్చి 31 2023 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రధానమంత్రి వయ వందన యోజన పథకం యొక్క అర్హతలు ఏంటీ?
ఈ పథకాన్ని దేశంలోని 60 ఏళ్లు దాటిన వయోజనులు ఎవరైనా కొనుగోలు చేయవచ్చు.
ఈ పథకాన్ని ఎల్ఐసి నిర్వహిస్తుంది. ఈ పథకానికి గరిష్ట వయో పరిమితి అంటూ ఏమీ లేదు.
సమీప LIC బ్రాంచ్ లో మీ డాక్యుమెంట్స్ సమర్పించి ఖాతా తెరవవచ్చు.
ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకం యొక్క పాలసీ దర మరియు పెన్షన్ ఎంత ?
చందదారుడు పొందాలనుకునే పెన్షన్ ఆధారంగా పాలసీధర ఉంటుంది.కనీసం నెల కు వెయ్యి రూపాయల నుంచి గరిష్టంగా 9250 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.
నెలకు ₹1000 రూపాయలు పెన్షన్ కనీసం పొందాలనుకుంటే, కనీస పాలసీ ధర 1,62,162 గా ఉంటుంది.₹15,00000 పాలసీ తీసుకుంటే ₹9250 వరకు ప్రతి నెల పెన్షన్ పొందవచ్చు.
అంతే కాదు, పెన్షన్ అమౌంట్ మీరు నెల వారీగా లేదా ఆరు నెలల కు ఒకసారి లేదా వార్షికంగా కూడా పొందవచ్చు.
దీనిపై వచ్చే వడ్డినే పెన్షన్ గా ఇస్తారు. ఎంత వడ్డీ అంటే?
ఈ పథకం కి ప్రస్తుతం 7.4 % వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ వడ్డీ మార్చ్ 31 2023 వరకు స్థిరంగా ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు పాలసీ ఈ వడ్డీ పై తీసుకుంటే 10 ఏళ్ల పాలసీ టర్మ్ వరకు ఇదే వడ్డీ వర్తిస్తుంది.
పెన్షన్ ఎప్పటి నుంచి మంజూరు చేస్తారు? Withdraw ఆప్షన్స్ ఏంటి?
పెన్షన్ మంజూరు పాలసీ తీసుకున్న మరుసటి నెల నుంచే వర్తిస్తుంది.పెన్షన్ కాల వ్యవధి 10 యేళ్లు ఉంటుంది.
పాలసీ దారుడు చెల్లించిన అసలు అమౌంట్ ఏమవుతుందంటే..అసలు అమౌంట్ ను 10 ఏళ్ల కు పెన్షన్ చివరి వాయిదా తో పాటు చెల్లిస్తారు.
ఒకవేళ పాలసీ దారునికి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే 98% ముందస్తు withdraw చేసుకోవచ్చు.పాలసీ దారుడు మరణిస్తే పూర్తి పాలసీ అమౌంట్ ను నామిని కి చెల్లిస్తారు
అయితే ఈ పాలసీపై వచ్చే పెన్షన్ అమౌంట్ కు పన్ను రాయితీ అయితే ఉండదు. అంతేకాకుండా అసలు అమౌంట్ కు 80c వర్తించదు.
ఇక ఒక వ్యక్తి గరిష్టంగా 15 లక్షల వరకు మాత్రమే పాలసీ తీసుకోగలరు అయితే ఎన్ని పాలసీ లు అయినా తీసుకోవచ్చు. అన్ని పాలసీల అమౌంట్ కలిపి కూడా 15 లక్షలు మించ రాదు.
భార్య భర్త ఇద్దరు 60 యేళ్లు దాటిన వారు అయితే చెరో 15 లక్షల వరకు పాలసీ తీసుకునే వెసులుబాటు అయితే ఉంటుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ పథకానికి మార్చ్ 31 చివరి తేదీ. కావున పాలసీ తీసుకోదలచిన వారు ఆధార్, పాన్, వయసు రుజువు చేసే ఏదైనా ధృవ పత్రం, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ ఖాతా పాస్ బుక్ తీసుకొని సమీప LIC కార్యాలయాన్ని సంప్రదించి పాలసీ తెరవవచ్చు.
Leave a Reply