దేశంలోని పేద విద్యార్థుల విద్యను అభ్యసించడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి యశస్వి స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం Social Justice and Empowerment (MSJ&E) మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ల ద్వారా అమలు చేస్తుంది. 2023 సంవత్సరానికి గాను పీఎం యశస్వి స్కాలర్షిప్లకు పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.
PM Yasasvi Scheme 2023 Details :
పథకం పేరు | PM యశస్వి పథకం |
ప్రారంభించినది | సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం |
సంవత్సరం | 2023 |
లబ్దిదారులు | OBC, EBC, DNT/NT/SNT వర్గాల నుండి మెరిటోరియస్ విద్యార్థులు |
దరఖాస్తు విధానం | Online Mode |
లక్ష్యం | ప్రతిభావంతులు అయిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం |
ప్రయోజనాలు | 75,000 నుండి రూ. 1,25,000 వరకు స్కాలర్షిప్లు |
దరఖాస్తు ఫీజు | ఉచితం |
అధికారిక వెబ్సైట్ | https://yet.nta.ac.in |
PM యశస్వి పథకం అర్హతలు:
- దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతదేశ శాశ్వత నివాసి అయ్యి ఉండాలి.
- OBC, EBC, DNT SAR, NT లేదా SNT కమ్యూనిటీకి చెందినవారు అర్హులు.
- కేవలం 9వ తరగతి లేదా 11వ తరగతి (Inter 1st Year) చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.
- 9వ తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 01-04-2007 to 31-03-2011 మధ్య జన్మించి ఉండాలి.
- 11వ తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 01-04-2005 to 31-03-2009 మధ్య జన్మించి ఉండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల రూపాయలకు మించరాదు.
- 2022-23 విద్యా సంవత్సరంలో 8వ తరగతి లేదా 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి .
ప్రధానమంత్రి యశస్వి పథకం 2023 ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చేయుటకు ప్రారంభతేదీ | 11 జులై 2023 |
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ | 17 ఆగస్టు 2023 రాత్రి 11.50 గంటల వరకు |
పరీక్ష తేదీ | 29 సెప్టెంబర్ 2023 (శుక్రవారం) |
అప్లికేషన్ వివరాలు మార్చుకోవడానికి చివరి తేదీ | 12 ఆగష్టు 2023 నుంచి 16 ఆగష్టు 2023 వరకు |
Admit Card డౌన్లోడ్ తేదీ | త్వరలో తెలియజేయడం జరుగుతుంది |
పరీక్ష తేదీ | త్వరలో తెలియజేయడం జరుగుతుంది |
ప్రవేశ పరీక్ష యొక్క విధానం :
- పరీక్ష విధానం: Offline Mode – Pen and Paper Method ( OMR Based )
- పరీక్ష వ్యవధి: 2 గంటలు 30 నిముషాలు (150 నిముషాలు)
- మీడియం: హిందీ మరియు ఇంగ్లీష్
- పరీక్ష రుసుము: పరీక్ష రుసుము లేదు.
- ప్రశ్నల సంఖ్య: 100 MCQలు
- నెగిటివ్ మార్కులు : ఉండవు
- పరీక్ష కేంద్రాలు: భారతదేశంలోని 740 నగరాలు . ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రం ఉంటుంది .
PM Yasasvi Scheme 2023 Entrance Exam Pattern :
Subjects of Test | No. of Questions | Total Marks |
Mathematics | 30 | 30 |
Science | 25 | 25 |
Social Science | 25 | 25 |
General Awareness/Knowledge | 20 | 20 |
PM యశస్వి పథకం 2023 దరఖాస్తు కు కావాల్సిన డాక్యుమెంట్ లు :
- విద్యార్ధి ఆధార్ కార్డు
- ఈ మధ్య తీసిన పాస్ పోర్ట్ సైజు ఫోటో
- విద్యార్ధి సంతకం
- కేటగిరీ ద్రువీకరన పత్రం (Category Certificate)
- PWD సర్టిఫికెట్ (అర్హులు అయితే)
- 8వ తరగతి పాస్ సర్టిఫికెట్ లేదా 10వ తరగతి పాస్ సర్టిఫికెట్
- ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income Certificate)
- విద్యార్ధి ID కార్డు
- ఈమెయి ఐడి మరియు మొబైల్ నెంబర్
PM యశస్వి పథకం 2023 కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయు విధానము :
Step 1 : దరఖాస్తు చేయాలి అనుకునే వారు ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి హోమ్ పేజీ లోకి వెళ్ళండి
New Candidiate Register Here పై క్లిక్ చెయ్యండి .అక్కడ చిపించే 20 వివరాలు పూర్తిగా , శ్రద్దగా చదివి బాక్స్ లో టిక్ చేసి Click Here To Proceed పై క్లిక్ చెయ్యండి .
Step 2 : అంతకన్న ముందు కింద తెలిపిన డాక్యుమెంట్ లు పక్కన చూపించిన సైజు లో స్కాన్ చేసి సేవ్ చేసుకోండి .
- పాస్ పోర్ట్ సైజు ఫోటో (in jpg/ jpeg file, size 10Kb – 200Kb) either in colour or black & white with 80% face (without mask) visible including ears against white background.
- విద్యార్ధి సంతకం(in jpg/ jpeg file, size: 4kb – 30kb);
- కేటగిరీ ద్రువీకరన్ పత్రం ( in Pdf file size: 50kb – 300kb);
- ఆదాయ ధ్రువీకరణ పత్రం (in Pdf file size: 50kb – 300kb);
- PWD సర్టిఫికెట్ ( in Pdf file size 50 kb-300 kb), if applicable.
- ఆధార్ కార్డు ( in Pdf file size 50 kb-300 kb)
Step 3 : Personal Details :
- Apply For ( Class 9th or Class 11th)
- Candidate Name
- Email Address
- Confirm Email Address
- Mobile Number
- Alternate Mobile Number
- Date of Birth
Choose Password :
- Password
- Confirm Password
- Security Question (మీ మొదటి పాఠశాల పేరు / మీరు పుట్టిన ప్రదేశం)
- Security Answer
Step 4 : తరువాత Submit and Send OTP పై క్లిక్ చెయ్యండి . OTP ఎంటర్ చేసి Confirm చేసిన తరువాత అప్లికేషన్ ID నోట్ చేసుకోవాలి .
తరువాత హోమ్ పేజీ లో Application Form పేజీ కు వెళ్ళండి .అందులో అప్లికేషన్ నెంబర్ , పాస్వర్డ్ , కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి . Complete Application Form పై క్లిక్ చెయ్యండి. తరువాత విద్యార్థికి సంబంధించి
- Personal Details Form ,
- Contact Details Form ,
- Exam Details ,
- Education Details &
- Others Details
ఎంటర్ చేసి అప్లికేషన్ Review Page లో అన్ని వివరాలు సరి చూసుకొని ఫైనల్ సబ్మిట్ చెయ్యాలి . అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి .
PM యశస్వి పథకం 2023 Contact Information :
- NTA Help Desk : 011-69227700, 011-40759000
- NTA Email Address: yet@nta.ac.in
- Website: www.nta.ac.in, yet.nta.ac.in, socialjustice.gov.in
Leave a Reply