దేశవ్యాప్తంగా చేతి వృత్తులు మరియు సంప్రదాయ కులవృత్తులు చేసుకుంటూ వాటిపైనే జీవిస్తున్నటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పీఎం విశ్వకర్మ యోజన [PM Vishwakarma Yojana] పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు.
ఒడిశా నుంచి PM విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని
ఒడిశా లో జరిగినటువంటి PM విశ్వకర్మ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని మోడీ హాజరయ్యారు.సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి జయంతిని పురస్కరించుకొని ప్రధాని ఈ కార్యక్రమానికి పచ్చ జెండా ఊపారు.
ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి సెప్టెంబర్ మొదటి వారం నుంచే కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అర్హత ఉన్నటువంటి చేతి వృత్తుల వారు మరియు సంప్రదాయకుల వృత్తులపై జీవనాధారం సాగిస్తున్నటువంటి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కేంద్ర మంత్రులు మరియు ప్రధానమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అంటే ఏమిటి , అర్హతలు ,వృత్తుల జాబితా , ఎలా అప్లై చేసుకోవాలి వంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
PM Modi launches PM Vishwakarma Yojana on September 17th from Odisha
పీఎం విశ్వకర్మ యోజన అనగా ఏమి? [About PM Vishwakarma]
సంప్రదాయంగా చేతివృత్తులు చేసుకుంటూ జీవనాధారం సాగించే వారి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సరికొత్త పథకమే ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం. సుమారు 13,000 కోట్ల రూపాయలు వ్యయంతో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఈ పథకాన్ని అయిదు సంవత్సరాల కాలం పాటు , అనగా 2023-24 ఆర్థిక సంవత్సరం మొదలుకొని 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా చేతివృత్తుల వారు మరియు హస్తకళల నిపుణులకు ఆర్థిక సహాయాన్ని అందించి వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. చేతివృత్తుల చేసుకునే వారు, హస్తకళల నిపుణులు రూపొందించే వస్తువులు మరియు సేవల యొక్క నాణ్యత ను మరియు వాటి వ్యాప్తి ని మెరుగు పరచి, ఆయా విశ్వకర్మలను దేశీయంగా మరియు విదేశీ వేల్యూ చైన్ తో ముడిపడేటట్లు చేయడం అనేది కూడా ఈ పథకం యొక్క ధ్యేయం గా ఉంది. తద్వారా విదేశీయంగా కూడా వీరి ఉత్పత్తులు అమ్ముడు అయ్యే అవకాశం ఉంటుంది.
Benefits of PM Vishwakarma: అర్హులైన వారికి విశ్వకర్మ సర్టిఫికెట్, గుర్తింపు కార్డు మరియు ఆర్థిక సహాయం
పిఎం విశ్వకర్మ పథకం లో భాగంగా, చేతివృత్తుల వారికి మరియు హస్తకళల నిపుణులకు కింది ప్రయోజనాలు ఉంటాయి.
✓పిఎమ్ విశ్వకర్మ సర్టిఫికెటు ను, గుర్తింపు కార్డు ను ఇస్తారు
✓ ఒక లక్ష రూపాయల వరకు (ఒకటో దఫా లో) మరియు 2 లక్షల రూపాయల వరకు (రెండో దఫా లో) రుణాన్ని 5 శాతం సబ్సిడీ వడ్డీ తో ఇస్తారు.
✓ ఈ పథకం లో భాగం గా నైపుణ్య శిక్షణ, పనిముట్టులకు సంబంధించి ప్రోత్సాహకాలు, డిజిటల్ ట్రాన్సాక్శన్స్ మరియు మార్కెటింగ్ సంబంధించి సహాయ సహకారాలను కూడా అందజేయడం జరుగుతుంది.
✓ పీఎం విశ్వకర్మ లో రెండు రకాల నైపుణ్య శిక్షణలో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. బేసిక్ నైపుణ్య అభివృద్ధి శిక్షణ మరియు అడ్వాన్స్డ్ నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఉంటాయని తెలిపింది. లబ్ధిదారులకు శిక్షణ కాలంలో రోజుకి రూ.500 చొప్పున స్టైపెండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
✓ అలాగే ఆధునిక యంత్రాలు, కొనుక్కోవడానికి
పరికరాలు రూ.15,000 వరకూ ఆర్థిక సాయం అందజేయనున్నారు. మొదటి ఏడాది 5లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. వచ్చే ఐదేళ్లలో మొత్తం 30 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి. గురు-శిష్య పరంపరను, కుటుంబ ఆధారిత సంప్రదాయ నైపుణ్యాలను బలోపేతం చేయడమే పథకం ఉద్దేశమని కేంద్రం తెలిపింది. తొలుత 18 రకాల సం
ప్రదాయ నైపుణ్యాలకు ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారు.
ఏ చేతి వృత్తుల వారికి ఈ పథకం వర్తిస్తుంది?
పిఎమ్ విశ్వకర్మ లో భాగం గా తొలి విడత లో 18 సాంప్రదాయిక చేతివృతులు చేసుకునే వారిని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. పూర్తి జాబితా ఇదే
(1) వడ్రంగులు;
(2) పడవల తయారీదారులు;
(3) ఆయుధ /కవచ తయారీదారులు;
(4) కమ్మరులు;
(5) సుత్తి, ఇంకా పరికరాల తయారీదారులు;
(6) తాళాల తయారీదారులు;
(7) బంగారం పని ని చేసే వారు;
(8) కుమ్మరులు;
(9) శిల్పులు (ప్రతిమలు, రాతి చెక్కడం పని చేసేటటువంటి వారు), రాళ్ళను పగులగొట్టే వృత్తి లో ఉండే వారు;
(10) చర్మకారులు /పాదరక్షల తయారీ దారులు;
(11) తాపీ పనివారు;
(12) గంపలు/చాపలు/చీపురులను తయారు చేసేవారు;
(13) కొబ్బరి నారతో తయారు అయ్యే వస్తువుల ను చేసే వారు, (సాంప్రదాయిక ఆటబొమ్మల రూపకర్తలు);
(14) నాయి బ్రాహ్మణులు;
(15) మాలలు అల్లే వారు;
(16) రజకులు;
(17) దర్జీలు మరియు;
(18) చేపల ను పట్టేందుకు ఉపయోగించే వలల ను తయారు చేసేవారు
ఇతర కండిషన్స్ ఇవే..
✓ 18 యేళ్లు నిండి రిజిస్ట్రేషన్ సమయానికి పైన పేర్కొన్న ఏదో ఒక చేతి వృత్తి చేసుకుంటూ ఉండాలి.
✓ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు.
✓ ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకానికి అర్హత ఉంటుంది
✓ గత 5 సంవత్సరాలలో PM స్వనిధి, ముద్రా, PMEGP వంటి పథకాల ద్వారా రుణాలను పొంది ఉండరాదు. ఒకవేళ పొంది ఉన్నట్లయితే వాటిని రిజిస్ట్రేషన్ సమయానికి పూర్తిగా చెల్లించిన వారు వీటికి అర్హులవుతారు.
PM Vishakarma Application – అప్లికేషన్స్ విధానం
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ లేదా అప్లికేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చేతివృత్తుల వారు సమీప గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి.
ఇక తెలంగాణలో ఉన్నటువంటి లబ్ధిదారులు సమీప మీసేవ కేంద్రంలో సంప్రదించవచ్చు.
కావలసిన డాక్యుమెంట్స్..[Required Documents]
పీఎం విశ్వకర్మ దరఖాస్తు తో పాటు కింది డాక్యుమెంట్స్ తీసుకోవడం జరుగుతుంది.
ఆధార్ కార్డ్, ప్రస్తుతం యాక్టివ్ లో ఉన్న మొబైల్ నెంబర్,బ్యాంక్ పాస్ పుస్తకం,రేషన్ కార్డ్ వంటివి తీసుకుంటున్నారు.
PM Vishwakarma Launched on : September 17
పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ను కింది వీడియో ద్వారా కూడా మీరు చూడవచ్చు.
Leave a Reply