కేంద్రం ఈ నెల 17 నుంచి ప్రారంభించనున్న ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకంలో రాష్ట్రంలో తొలి ఏడాదిలో 2.5 లక్షల మందిచేతివృత్తిదారులను నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి (సీఎస్) డాక్టర్ జవహర్రెడ్డి ఆదేశించారు.
ఆయన శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖలపై సమీక్ష జరిపారు. సీఎస్ మాట్లాడుతూ ఈ పథకానికి వడ్రంగి, కమ్మరి, తాళాల మరమ్మతు చేసేవారు, శిల్ప కళాకారులు, స్వర్ణకారులు, కుమ్మరి, చెప్పులు కుట్టేవారు, తాపీ, బుట్ట, చాప,చీపుర్లు, బొమ్మలు తయారీదారులు, క్షురకులు, పూల దండలు చేసేవారు, రజకులు, దర్జీలు, చేపల వలలు తయారీ చేసే వారు, పడవలు, పరికరాలు, ఇతర పనిముట్లు తయారీ చేసే వారు అర్హులని వివరించారు.
అర్హులైన వారికి తొలి విడతగా వారి వ్యాపారాభివృద్ధికి రూ.లక్ష రుణం అందిస్తారని, ఆ రుణం తీర్చిన తరువాత రెండో విడతగా మరో రూ. 2 లక్షలు వెరసి రూ.3 లక్షలను 5 శాతం స్థిర వడ్డీతో హామీలేని రుణం అందిస్తారని తెలిపారు.
ప్రతి లబ్ధిదారుకు రూ.15,000 విలువైన పనిముట్లను రాయితీ ద్వారా అందిస్తారన్నారు. శిక్షణ సమయంలో భోజనం, వసతితో పాటు రోజుకు రూ.500 వంతున స్టైపెండ్గా ఇస్తారని చెప్పారు. ఈ పథకానికి కుటుంబ వృత్తిగా చేస్తోన్న 18 ఏళ్లు కలిగిన వారు అర్హులని చెప్పారు.
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అర్హతలు ఏంటి? ఏ కులాలకు వర్తిస్తుంది
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి 18 రకాల సంప్రదాయ చేతివృత్తుల వారికి మొదటి దశలో అవకాశం కల్పించడం జరిగింది.
ఈ చేతి వృత్తుల వారి లిస్ట్ కింద ఇవ్వడం జరిగింది.
పూర్తి లిస్ట్ ఇదే..
పిఎమ్ విశ్వకర్మ లో భాగం గా తొలి విడత లో 18 సాంప్రదాయిక చేతివృతులు చేసుకునే వారిని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. పూర్తి జాబితా ఇదే
(1) వడ్రంగులు;
(2) పడవల తయారీదారులు;
(3) ఆయుధ /కవచ తయారీదారులు;
(4) కమ్మరులు;
(5) సుత్తి, ఇంకా పరికరాల తయారీదారులు;
(6) తాళాల తయారీదారులు;
(7) బంగారం పని ని చేసే వారు;
(8) కుమ్మరులు;
(9) శిల్పులు (ప్రతిమలు, రాతి చెక్కడం పని చేసేటటువంటి వారు), రాళ్ళను పగులగొట్టే వృత్తి లో ఉండే వారు;
(10) చర్మకారులు /పాదరక్షల తయారీ దారులు;
(11) తాపీ పనివారు;
(12) గంపలు/చాపలు/చీపురులను తయారు చేసేవారు;
(13) కొబ్బరి నారతో తయారు అయ్యే వస్తువుల ను చేసే వారు, (సాంప్రదాయిక ఆటబొమ్మల రూపకర్తలు);
(14) నాయి బ్రాహ్మణులు;
(15) మాలలు అల్లే వారు;
(16) రజకులు;
(17) దర్జీలు మరియు;
(18) చేపల ను పట్టేందుకు ఉపయోగించే వలల ను తయారు చేసేవారు
ఈ పథకానికి ప్రధానంగా చాలా వరకు చేతి పనుల వారికి అవకాశం కల్పించడం జరిగింది. ప్రధానంగా కుమ్మరి, కమ్మరి, తాపీ పని చేసే వారు, చర్మకారులు, రజకులు, దర్జీలు, మాలలు అల్లేవారు, శిల్పులు, బంగారం పని చేసేవారు, వడ్రంగులు, చేపలు పట్టె వలలు తయారు చేసేవారు అర్హులు.
ఈ పథకానికి అర్హత పొందటానికి మరికొన్ని కండిషన్స్ కింద ఇవ్వబడ్డాయి చెక్ చేయండి
– 18 సంవత్సరాలు నిండి రిజిస్ట్రేషన్ చేసే సమయానికి పైన ఇవ్వబడిన ఏదో ఒక చేతివృత్తి లో ఉండాలి
– కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ సహాయం అందించడం జరుగుతుంది.
– కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు.
– గత 5 సంవత్సరాలలో PM స్వనిధి, ముద్ర, PMEGP వంటి రుణాలను తీసుకొని ఉండరాదు ఒకవేళ తీసుకొని ఉంటే వాటిని పూర్తిగా చెల్లించి ఉన్నట్లయితే అటువంటి వారు అర్హులు.
పీఎం విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి బెనిఫిట్స్
అర్హత కలిగి అప్లై చేసుకున్న వారికి విశ్వకర్మ సర్టిఫికెట్ ను ఇవ్వటం జరుగుతుంది. ఈ సర్టిఫికెట్ పొందిన వారు కింది ప్రయోజనాలను పొందవచ్చు.
✓ తొలి విడతలో లక్ష వరకు రుణం కేవలం 5% శాతం వడ్డీ తో పొందవచ్చు.
✓ తొలివిడత అమౌంట్ తీర్చిన తర్వాత రెండో విడత లో భాగంగా 2 లక్షల వరకు అమౌంట్ ఎటువంటి హామీ లేకుండా పొందవచ్చు.
పొందినటువంటి రుణాన్ని ప్రతినెలా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
✓ ₹15000 వేల వరకు విలువగల పనిముట్లను రాయితీపై అందిస్తారు.
✓ అవసరమైన వారికి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కల్పించడం జరుగుతుంది. ఆ సమయంలో రోజుకి 500 రూపాయలు మరియు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది.
✓ ఇంకా అర్హులైన వారికి బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది.
పీఎం విశ్వకర్మకు సంబంధించినటువంటి లేటెస్ట్ మరియు పూర్తి సమాచారం కింది వీడియో ద్వారా చూడవచ్చు.
Leave a Reply