Ujjwala Scheme: సిలిండర్ పై ₹200 రాయితీ ప్రకటించిన కేంద్రం..9.59 కోట్ల మందికి లబ్ది

Ujjwala Scheme: సిలిండర్ పై ₹200 రాయితీ ప్రకటించిన కేంద్రం..9.59 కోట్ల మందికి లబ్ది

ప్రధాన మంత్రి ఉజ్జ్వల పథకం లబ్ధిదారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 9.59 కోట్ల మంది గ్యాస్ వినియోగ దారులకు సిలిండర్ పై ₹200 రూపాయల రాయితీ ప్రకటించింది.

PMUY ద్వారా సిలిండర్ పొందిన అందరికీ 14.2 కేజీల గృహ సిలిండర్ల పై ఈ రాయితీ వర్తిస్తుంది. ఏడాది కి 12 సిలిండర్ల వరకు ఈ రాయితీ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.

పెరుగుతున్న అధిక సిలిండర్ ధరల నుంచి పేద వారికి ఊరట కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ పథకం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం లో ₹7680 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

అసలు ఎంటి ఈ ఉజ్జ్వల పథకం

ఈ పథకం ద్వారా పేద మహిళలకు కేంద్రం ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉజ్జ్వల యోజన 2.0 నడుస్తుంది.

BPL కార్డ్ కలిగి దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న కుటుంబాలలో మహిళలు ఈ పథకానికి అర్హులు. 18 యేళ్లు నిండి ఉండి, ఇంట్లో ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉండరాదు. వీరు సంబంధిత డాక్యుమెంట్స్ తో LPG డీలర్ ను సంప్రదించి, వారి వద్ద PMUY ఫార్మ్ నింపి అప్లై చేసుకోవచ్చు.

ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు కింది లింక్ లో చెక్ చేయవచ్చు

Click here to Share

4 responses to “Ujjwala Scheme: సిలిండర్ పై ₹200 రాయితీ ప్రకటించిన కేంద్రం..9.59 కోట్ల మందికి లబ్ది”

  1. Sharmilaallabakahu Avatar
    Sharmilaallabakahu

    Vidavalur

  2. Kankam divya Avatar
    Kankam divya

    1_117koratapalli

  3. VEPATI SOWJANYA Avatar
    VEPATI SOWJANYA

    No

  4. తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర.. ఎంత తగ్గించారంటే – GOVERNMENT SCHEMES UPDATES

    […] ఇది చదవండి: ఉజ్వల పథకం ద్వారా దేశవ్యాప్తంగా గ్యా… […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page