Vishwakarma Yojana – స్వాతంత్ర దినోత్సవ వేళ విశ్వకర్మ యోజన పథకానికి శ్రీకారం చుట్టిన ప్రధాని

Vishwakarma Yojana – స్వాతంత్ర దినోత్సవ వేళ విశ్వకర్మ యోజన పథకానికి శ్రీకారం చుట్టిన ప్రధాని

దేశవ్యాప్తంగా చేతి వృత్తులను జీవనాధారంగా కొనసాగిస్తున్నటువంటి వారికి ప్రధానమంత్రి స్వాతంత్ర దినోత్సవ వేళ శుభవార్త అందించారు.

వచ్చేనెల అనగా సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని చేతివృత్తుల వారికి విశ్వకర్మ యోజన [Vishwakarma Yojana ] అనే సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

సంప్రదాయ చేతివృత్తులపై జీవనాధారం కొనసాగిస్తున్నటువంటి వారికి ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ వృత్తులైనటువంటి కుమ్మరి, రజకులు, నాయి బ్రాహ్మణ, పద్మశాలీలు, బంగారం పని చేసేటటువంటి కంసాలీలు మరియు ఇతర సంప్రదాయ చేతివృత్తుల వారికి ఈ పథకం వర్తిస్తునట్లు ఆయన ప్రకటించారు.

ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా చేనేత కళాకారులు రూపొందించిన ఉత్పత్తులు మరియు సేవల నాణ్యత ను మెరుగుపరచడం. దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లకు వారి ఉత్పత్తులను పరిచయం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

ప్రధానంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు మరియు సమాజంలోని ఇతర బలహీన వర్గాలకు చెందిన కార్మికుల ఆర్థిక సాధికారతకు ఈ పథకం సహాయపడుతుంది.

ఈ పథకం కోసం 13 నుంచి 15 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లుగా ప్రధానమంత్రి ప్రకటించారు.

PM Modi announces vishwakarma yojana during 77th IDAY celebration
Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page