జూన్ 1న ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్సార్ రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే.
అయితే కేవలం వైయస్సార్ రైతు భరోసా అమౌంట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి రైతులకు 5500 మాత్రమే జమ అవుతున్నాయి. మిగిలిన 2000 రూపాయలు PM కిసాన్ నిధులు తర్వాత జమ అవుతాయి.
PM కిసాన్ 14 వ విడత ఎప్పుడు జమ చేస్తారు?
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కి సంబంధించి 13 విడుతలను రైతుల ఖాతాలో జమ చేయగా, ప్రస్తుతం 14 వ విడత అమౌంట్ పెండింగ్ లో ఉంది.
ఈ అమౌంట్ రైతుల ఖాతాలో జూన్ నెల ఆఖరు నాటికి జమ చేసే అవకాశాలు ఉన్నాయి.. గతంలో ఒకవేళ రైతు భరోసా నిధులు పీఎం కిసాన్ విడుదల తర్వాత లేదా అదే సమయంలో విడుదల చేస్తున్నట్లైతే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ పేరిట రెండు నిధులు ఇంచుమించు ఒకేసారి జమ అయ్యేవి. అయితే ప్రస్తుతం PM కిసాన్ విడుదల మరింత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే రైతు భరోసా ఐదవ విడత అమౌంట్ అనగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి విడత అమౌంట్ 5500 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసింది.
రైతు భరోసా కూడా ఇంకా పడలేదా?
జూన్ 1న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి వైయస్సార్ రైతు భరోసా అమౌంట్ ఇంకా తమ ఖాతాలో పడలేదని పలువురు రైతులు రిపోర్ట్ చేస్తున్నారు.
చాలామందికి స్టేటస్ చెక్ చేసినప్పుడు “Payment under Processing” అని చూపిస్తుంది. అంటే త్వరలోనే మీకు అమౌంట్ పడుతుంది.
విడుదలైన తర్వాత శని ఆదివారాలు వచ్చిన నేపథ్యంలో కొంత అలస్యమైనట్లు సమాచారం. అయితే జూన్ రెండో వారంలో కచ్చితంగా రైతుల ఖాతాలో అమౌంట్ పడుతుందని తెలుస్తుంది.
రైతు భరోసా స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి వైయస్సార్ రైతు భరోసా 2023-24 పేమెంట్ స్టేటస్ వివరాలను మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి ఆన్లైన్ లో కింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
Leave a Reply