కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం మరో కీలక పథకానికి ఆమోదం తెలిపింది. ‘ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన’ (Prime Minister Dhan Dhanya Yojana) పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఏటా 24 వేల కోట్ల రూపాయలను ఈ పథకానికి వెచ్చించనుంది. మరి ఈ పథకం ఏంటి? ఈ పథకం వలన ఏమీ బెనిఫిట్స్ తదితర అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం
దేశవ్యాప్తంగా 100 జిల్లాలలో వ్యవసాయ ఉత్పాదకత, పంటల వైవిద్యం మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త పథకమే ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన పథకం. ఇందులో భాగంగా సాగునీటి పారుదుల సౌకర్యాలను పెంచడం, గ్రామస్థాయిలో పంట దిగుబడును నిల్వ ఉంచుకునేందుకు గోదాములను ఏర్పాటు చేయడం మరియు రైతులకు రుణ లభ్యత పెంచడం వంటి ముఖ్యమైన సేవలను కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా అమలు చేయనుంది.
ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ఎలా అమలు చేస్తారు?
- ముందుగా దేశవ్యాప్తంగా తక్కువ పంట దిగుబడి, తక్కువ విస్తీర్ణత, తక్కువ రుణలభ్యత వంటి సమస్యలు ఉన్న 100 జిల్లాలను ఎంపిక చేస్తారు.
- 2025 26 సంవత్సరం నుంచి ఆరు సంవత్సరాల పాటు ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం ఈ 100 జిల్లాలలో అమలు చేయడం జరుగుతుంది.
- తరువాత ఇప్పటికే ఉన్నటువంటి 36 కేంద్ర పథకాలు మరియు రాష్ట్ర పథకాల తోటి ఈ పథకాన్ని అనుసంధానం చేస్తారు.
- పైన పేర్కొన్న విధంగా ఉత్పాదకత పెంచడం రుణలభ్యత ను పెంచడం సహా ఈ పథకం యొక్క లక్ష్యాలను సాధించడం కోసం జిల్లా రాష్ట్ర మరియు కేంద్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
- పంచాయతీ మరియు బ్లాక్ స్థాయిలలో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది.
- ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఏటా 24 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది.
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. క్లిక్ చేయండి
Leave a Reply