డిసెంబర్ 1,2022 నుండి MAY 31,2023 మధ్యలో దరఖాస్తు చేసిన పెన్షన్లు కు సంబంధించిన డేటా YSR PENSION KANUKA APP 2.7.2 UPDATED వెర్షన్ లో ENABLE అయింది. సంబధిత WEA/WWDS ఈ వెరిఫికేషన్ చేయాలి.
దరఖాస్తు చేసిన కొత్త పెన్షన్ లలో కొందరి విద్యుత్ వినియోగం DATABASEలో 0 గా ఉంది , (అంటే కొందరికి సొంత ఇల్లు ఉండి కూడా వాళ్ళ ఆధార్ ను విద్యుత్ మీటర్ కు లింక్ చేసుకోలేదు EX : NBM లో వారికి URBAN PROPERTY చూపిస్తుంది కానీ విద్యుత్ వినియోగం 0 ఉంది)
లబ్దిదారులు విద్యుత్ వినియోగం చేస్తున్నారా,
వాళ్ళు నివసించేది OWN HOUSE లేక RENT HOUSE సంబందించిన వివరాలు APP ద్వారా నమోదు చేయాలి.
VERIFICATION లో ఎటువంటి తప్పులు లేకుండ సబ్మిట్ చేయాలి. ఆప్షన్స్ అన్ని ఒకటికి రెండు సార్లు చదివి సరియైన వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
మొదటగా సంబంధిత WWDS/WEA పాత 2.7 app uninstall చేసి 2.7.2 యాప్ ను install చేసుకోవాలి.
లాగిన్ అయిన తరువాత “METER DETAILS CAPTURE” అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.తర్వాత మీ సచివాలయానికి సంబంధించిన విద్యుత్ వినియోగం 0 ఉన్న వారి పేర్లు ఉంటాయి.
తదుపరి ఏ పెన్షనర్ వివరాలు వెరిఫికేషన్ చేయాలో, ఆ పెన్షనర్ పేరు మీద క్లిక్ చేయాలి.
అందులో మొదటగా “HOUSE TYPE” లో “OWN HOUSE OR RENT HOUSE” అనే ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళు సొంత ఇంట్లో నివాసం అంటే OWN అని, అద్దెకు ఉంటే RENTED HOUSE అని ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందో ఆ వివరాలు కూడా వెరిఫై చేసుకుని అప్పుడు తగిన ఆప్షన్ ఎంచుకోవడం మంచిది.
తర్వాత ప్రశ్నలో వాళ్ళు ఉండే నివాసంలో విద్యుత్ మీటర్ “SEPARTE OR COMMON” అనే ఆప్షన్స్ ఉంటాయి… పెన్షనర్ కు SEPARATE గా మీటర్ ఉంటే సెపరేట్ అని ఎంచుకోవాలి….(అంటే ఆ మీటర్ ను ఆ పెన్షనర్ కుటుంబం మాత్రమే వినియోగిస్తారు)
అలా కాకుండా కొందరు OWN HOUSE లేదా RENTED HOUSE లో 1 కంటే ఎక్కువ కుటుంబాలు ఒకే మీటర్ ను వినియోగిస్తారు అంటే వాళ్ళకి COMMON మీటర్ ఉంటాది అలాంటి వారికి “COMMON METER” అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
తర్వాత ఎన్ని కుటుంబాలు ఉంటాయో అన్ని కుటుంబాల సంఖ్య ఎంటర్ చేయాలి.
తర్వాత ప్రశ్నలో “SELECT ELECTRICITY BOARD” అనే ఆప్షన్ లో 3 ఆప్షన్స్ ఉంటాయి
ఆ విద్యుత్ మీటర్ ఏ BOARD పరిధిలోకి వస్తె ఆ ఆప్షన్ ఎంచుకోవాలి…(APEPDCL &APCPDCL& APSPDCL)
తదుపరి వాళ్ళు వినియోగించే విద్యుత్ మీటర్ యొక్క నంబర్ ఎంటర్ చేయాలి.
REMARKS COLUMNలో ELIGIBLE/INELIGIBLE అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.చేసిన తర్వాత PENSIONER యొక్క THUMB/IRISH/FACE లేదా PENSIONER యొక్క ఆధార్ కు లింక్ అయిన మొబైల్ కు OTP వెళ్తుంది ఆ OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఇక్కడితో ఆ PENSIONER యొక్క verification పూర్తి అయినట్టు.
NOTE:
APEPDCL అయితే సర్వీస్ నంబర్ లో 16 digits ఉంటాయి.
APCPDCL&APSPDCL అయితే సర్వీస్ నంబర్ లో 13 digits ఉంటాయి.
Leave a Reply