Pension Disbursement Last Date Extended – పెన్షన్ పంపిణీ పొడిగించిన ప్రభుత్వం

ప్రతి నెల ఒకటో తేదీ నుండి 5వ తేదీ వరకు రాష్ట్రంలోని వృద్ధులు వితంతువులు మరియు వికలాంగులకు ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేస్తుంది. సెప్టెంబర్ నెలలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి పెన్షన్లు మంజూరు అయ్యాయి. అయితే ఇంకా కొన్ని పెన్షన్ అప్లికేషన్లు మండల పరిషత్ అధికారులు వెరిఫికేషన్ పూర్తి కానందున చాలామంది పేర్లు పెన్షన్ పంపిణీ లిస్టులో రాలేదు. వెరిఫికేషన్ పూర్తయి రెండు మూడు రోజుల్లో పెన్షన్ పంపిణీ లిస్టులో వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం మొదట పెన్షన్ పంపిణీ సెప్టెంబర్ 7 వరకు పొడిగించింది. అయితే ఇంకా ఆలస్యమయ్యే సూచనలు ఉన్నందున సెప్టెంబర్ నెల ఫంక్షన్ పంపిణీని సెప్టెంబర్ 10వ తేదీ వరకు పొడిగిస్తూ సెర్ప్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు

పెన్షన్ పంపిణీ కి సంబంధించిన సమాచారం

కులం, మతం, పార్టీలకు అతీతంగా, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని, సామాజిక పింఛన్లకు ఇచ్చే నగదును ఏటా పెంచుతామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెర వేరుస్తున్నారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువుల జీవితాల్లో వెలుగులు నింపేలా వైఎస్సార్ పింఛన్ కానుక పథకాన్ని అమలు చేస్తున్నారు.

ఇంకా ఎవరైనా అర్హులు ఉండి, దరఖాస్తు చేసు కుంటే వారికి సైతం పింఛన్లు మంజూరు చేస్తు
న్నారు. ఒకటో తేదీ తెల్లవారుజాము నుంచి ఐదో తేదీలోగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వలంటీర్లు పింఛన్లు అందజేస్తున్నారు. ఆయా పింఛన్లకు ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు లబ్దిదారులుగా గుర్తిస్తున్నారు.

సెప్టెంబర్ నెలలో కొత్తగా మంజూరు అయ్యి మిస్ అయిన పెన్షన్లకు సంబంధించిన సమాచారం

  • కొన్ని పెన్షన్ అప్లికేషన్స్ వివిధ టెక్నికల్ కారణాలవలన వెరిఫికేషన్ కు రావడం జరగలేదు అటువంటి పెండింగ్ అప్లికేషన్స్ MPDO / మునిసిపల్ కమీషనర్ గార్ల మొబైల్ అప్ కు వెరిఫికేషన్ కు ఇవ్వడం జరుగుతుంది.
  • ఈ పెండింగ్ అప్లికేషన్స్ అన్నీ కూడా 2వ తారీకు సాయంత్రానికి వెరిఫికేషన్ పూర్తి చేసిన అర్హులైన పెన్షన్ దారులందరికి ౩వ తారీకున అమౌంట్ రిలీజ్ చెయ్యడం జరుగుతుంది.
  • అర్హులైన ప్రతి పెన్షన్ దారునికి పెన్షన్ అమౌంట్ రిలీజ్ చెయ్యడం జరుగుతుంది. ఈ విషయం అన్ని గ్రామ / వార్డు సచివాలయముల వారికి తెలియ జేయవల్సినదిగా కోరడమైనది.

పెన్షన్ పంపిణి సమయంలో ఉపయోగపడే మొబైల్ అప్లికేషన్ లు

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page