ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నది. తాజాగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రారంభించింది.
నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు.
ఇప్పటికీ ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ఒకవేళ ఏదైనా ప్రభుత్వ సెలవు వచ్చిన రో వచ్చిన నెల ఒకటో తేదీకి ముందు రోజున పెన్షన్ పంపిణీ చేస్తున్నది. అయితే ఈ రోజు జరిగిన సభలో పెన్షన్ ఇక మూడు నెలలు కలిపి ఒకేసారి కూడా తీసుకోవచ్చని ప్రకటించారు.
పింఛన్ ఎవరు ఆపినా నిలదీయాలని, అది ప్రజల హక్కు అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇచ్చిన డబ్బు ఇంటి వద్దకు పంపిణీ చేయకపోయినా కూడా నిలదీయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ ప్రకటన ద్వారా ఏపైన ఆనివార్య కారణాల చేత పెన్షన్ అమౌంట్ తీసుకొని వారు, మరుసటి నెలలో ఒకేసారి రెండు నెలల పెన్షన్ తీసుకోవచ్చు. లేదా మూడు నెలలకు ఒకసారి కూడా పెన్షన్ అమౌంట్ తీసుకోవచ్చు. వృత్తిరీత్యా వేరే ప్రదేశాలలో పనిచేసే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఇందుకు సంబంధించిన విధి విధానాలు త్వరలో ప్రభుత్వం విడుదల చేయనుంది.
పెన్షన్ పంపిణీకి సంబంధించిన ముఖ్యమైన లింకులు మరియు అప్ సంబంధించి ఈ కింది లింక్ పైన క్లిక్ చేయండి
Leave a Reply