రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వాలంటీర్లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురి చేసాయి. అయితే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా లేదా ముగిసిందా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది వాలంటీర్లను గత ప్రభుత్వం మోసం చేసిందని,’గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు.. పంచాయతీలకు సమాంతర వ్యవస్థలా తయారయ్యాయని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థలు వేర్వేరు.
వాళ్లకు జీతాలు పెంచుదామంటే జీవోలు లేవు అని, .వాళ్లు ఉద్యోగంలో ఉన్నట్లు రికార్డులు ఉంటే ఆ వ్యవస్థను రద్దు చేయొచ్చు. కానీవాళ్లు వ్యవస్థలోనే లేరు. ఇదో సాంకేతిక సమస్య. సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధుల గౌరవ వేతనం పెంచే అంశం పరిశీలనలో ఉంది. సర్పంచులను ప్రథమపౌరులుగా గుర్తించే అంశాన్ని పార్టీలకు అతీతంగా చూస్తున్నాం’ అని ఉప ముఖ్యమంత్రి అన్నారు.
Leave a Reply