మీ పాన్ కార్డు పోయిందా? 5 నిమిషాల్లో కొత్త పాన్ కార్డు పొందండి….

మీ పాన్ కార్డు పోయిందా? 5 నిమిషాల్లో కొత్త పాన్ కార్డు పొందండి….

దేశంలోని ప్రతి ఒక్కరికి పాన్ కార్డు తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఆదాయపు పన్ను, ఇన్సూరెన్స్ పేమెంట్, పోస్ట్ ఆఫీస్, రూ.50,000/- పైబడి  బ్యాంకు ఖాతా ద్వారా తీసుకోవాలి లేదా వేరే బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్న , రుజువు పత్రంగా (POI) ,క్రెడిట్ కార్డు మరియు మరిన్ని సేవలకు పాన్ కార్డు కలిగి ఉండడం తప్పనిసరి.

అయితే పాన్ కార్డు అప్లై చేసుకున్న తర్వాత అనివార్య కారణాల చేత పాన్ కార్డును పోగొట్టుకోవడం జరుగుతూనే ఉంటుంది. ఇలా పోగొట్టుకున్నప్పుడు పోయిన పాన్ కార్డును ఎలా పొందాలో తెలియక చాలామంది సతమతమవుతుంటారు. పాన్ కార్డు ఆఫీసులో చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేస్తుంటారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి పాన్ కార్డు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆన్లైన్లో సులభంగా పాన్ కార్డును పొందడానికి Duplicate Pan Card ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

పాన్ కార్డును ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి మరియు ఎంత ఫీజు చెల్లించాలి తదితర వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

డూప్లికేట్ పాన్ కార్డు పొందడానికి ఫీజు ఎంత?

పోగొట్టుకున్న పాన్ కార్డును తిరిగి పొందడానికి ₹50 ఫీజు ఆన్లైన్ విధానంలో చెల్లించవలసి ఉంటుంది

కావలసిన డాక్యుమెంట్స్

  1. పాన్ కార్డు నెంబర్ 
  2. ఆధార్ కార్డు నెంబర్ 
  3. పాన్ కార్డుకు లింక్ అయిన మొబైల్ (రిజిస్టర్ అయిన మొబైల్ కి otp రావడం జరుగుతుంది)
  4. పాన్ కార్డు ప్రకారం పుట్టిన తేది వివరాలు

How to Order PAN Card Online in Telugu ?

పోయిన పాన్ కార్డును తిరిగి పొందడానికి, ముందుగా కింద ఇచ్చిన లింక్ ను ఓపెన్ చెయ్యండి .

PAN Card All Services Link

Reprint of PAN Card అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.

Request for Reprint of PAN Card పేజీ ఓపెన్ అవుతుంది . అందులో PAN Card NumberAadar Card Number, Date Of Birth వివరాలు ఎంటర్ చేసి, చెక్ బాక్స్ టిక్ చేసి, Captcha Code ఎంటర్ చేసి Submit పై క్లిక్ చెయ్యాలి.

తరువాత PAN Card  వివరాలు చూపిస్తాయి.

OTP ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయడానికి Mobile Number ఆప్షన్ పైన టిక్ చేయండి.Check Box పై టిక్ చేసి, Generate OTP పైన క్లిక్ చెయ్యాలి.

పాన్ కార్డు కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు 6 అంకెల OTP వస్తుంది.OTP ఎంటర్ చేసి Validate పైన క్లిక్ చేయాలి.

Payment పేజీ ఓపెన్ అవుతుంది. Online payment to PAYTM, Online payment through Bill Desk అనే రెండు ఆప్షన్ లు చుపిస్తుంది. Paytm ద్వారా అయితే మొదటి ఆప్షన్, Phone Pay, Google Pay, Debit Card, Credit Card ద్వారా అయితే రెండో ఆప్షన్ టిక్ చేయండి.

పేమెంట్ వివరాలు, Terms of Service వివరాలు చూపిస్తుంది. Agree ఆప్షన్ పైన tick చేసి, Proceed to Payment పై క్లిక్ చేయండి..

Confirm Payment పేజీలో Pay Confirm పై టిక్ చేయండి.

మీరు ఎంచుకున్న పేమెంట్ ఆప్షన్ ని బట్టి పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది.

UPI పేమెంట్ సెలెక్ట్ చేసుకొని ఉంటే ఓపెన్ అయిన qr code ని ఏదైనా upi యాప్  PhonePay / Google Pay ద్వారా పేమెంట్ చెయ్యవచ్చు.

Transaction Status, Transaction, Bank Ref ID వివరాలు చూపిస్తుంది. Transaction Status – Success అయిన తరువాత పేజీ ఓపెన్ అవుతుంది.

తరువాత Generate and Print Payment Receipt పై క్లిక్ చేయాలి.

Acknowledgment Number Note చేసుకోవాలి. Download PDF చేసుకోవాలి.

తరువాత Speed Post లో PAN Card మీరు ఇచ్చిన అడ్రస్ కు వస్తుంది. రిఫరెన్స్ id వివరాలు మీ మొబైల్ నెంబర్ కు SMS ద్వారా వస్తుంది.

 Indian Postal Tracking Site ద్వారా మీ కార్డ్ ను ట్రాక్ చెయ్యొచ్చు.

Click here to Share

One response to “మీ పాన్ కార్డు పోయిందా? 5 నిమిషాల్లో కొత్త పాన్ కార్డు పొందండి….”

  1. Mohammad Vasim Avatar
    Mohammad Vasim

    Aadhar Link Kani vi, Pancard Number gurthu leni pancard nu yela identify cheyali…….meru pettinavi andaraki telisimde kani nenu adigina ee samasya chala mandi satamata mavuthunnaru…diniki Answer Vetakamdi..
    Thank You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page