ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరికం నిర్మూలనకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక తుది దశకు చేరింది. దశలవారీగా ప్రభుత్వం లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను చేపట్టడం జరిగింది. ఆగస్టు 15 నాటికి లబ్ధిదారుల గుర్తింపు మరియు దత్తత తీసుకునే ప్రక్రియ పూర్తి అయ్యేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.

అసలు P4 పథకం అంటే ఏమిటి [What is P4 scheme]
రాష్ట్ర వ్యాప్తంగా పేదల్లో అట్టడుగున ఉన్న వారిని బంగారు కుటుంబం అని ప్రభుత్వం గుర్తిస్తుంది. ఆర్థికంగా స్థిరపడి బంగారు కుటుంబానికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చే వారిని మార్గదర్శి అని ప్రభుత్వం పేరు పెట్టింది. మార్గదర్శుల ద్వారా ప్రభుత్వం బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారికి సహాయం అందించనుంది. ఈ సహాయం ఏ రూపంలో అయినా ఉండవచ్చు. ఆర్థికంగా లేదా చదువుపరంగా లేదా వారికి తెలిసిన స్కిల్స్ ను ఇతరులకు పంచుకోవడం పరంగా తోడ్పాటు అందించడం జరుగుతుంది. ఒక బంగారు కుటుంబం ఒక మార్గదర్శి కంటే ఎక్కువమంది తోటి కూడా సహాయం పొందే అవకాశం ఉంది. ఒక మార్గదర్శి ఎన్ని బంగారు కుటుంబాలనైనా దత్తత తీసుకోవచ్చు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాల దత్తత లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది.
బంగారు కుటుంబాన్ని ఎలా గుర్తిస్తారు
ముందుగా మార్చి నెలలో P4 సర్వేలో భాగంగా ప్రభుత్వం 26 అంశాలతో కూడిన సర్వేను నిర్వహించింది. ఇందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయాలలో ఉన్నటువంటి సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ పరిస్థితులను స్థితిగతులను నమోదు చేసుకున్నారు. ఈ విధంగా నిర్వహించిన సర్వేలో కుటుంబ సభ్యుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాలలో కూడా ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత పలు మార్పులు చేర్పులు కూడా చేపట్టారు.
పైన పేర్కొన్న సర్వేలో అట్టడుగున 20 శాతం ప్రజలను ప్రభుత్వం మరల వేరు చేసింది. ఆ 20% ప్రజలను బంగారు కుటుంబాలుగా ప్రభుత్వం గుర్తించి గ్రామ సభలు కూడా నిర్వహించింది. గ్రామ సభల్లో తిరిగి మార్పులు చేర్పులు కూడా చేశారు. ఏ విధంగా బంగారు కుటుంబాన్ని గుర్తించారో కింది అర్హతలను బట్టి తెలుసుకోవచ్చు.

బంగారు కుటుంబం అర్హతలు [కింది అర్హతల్లో ఏది ఉన్నా బంగారు కుటుంబం కింద వస్తారు]
బంగారు కుటుంబ అర్హతలు ఈ విధంగా ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి సరిపోలినా కూడా అర్హత పొందవచ్చు.[Bangaru Kutumbam Eligibility 2025]
- Lpg గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబం. సాంప్రదాయ పద్ధతుల్లో మంట చేసుకుంటున్న వారు
- ఎటువంటి ఆదాయం లేని కుటుంబం. ఎటువంటి ఉద్యోగం, రాబడి, పెన్షన్ వంటివి లేని కుటుంబం.
- తాగునీటి సరఫరా లేని కుటుంబం, తాగునీరు తెచ్చుకునేందుకు కనీసం 30 నిమిషాలు పట్టే పరిస్థితి ఉన్న కుటుంబం.
- ఎటువంటి బ్యాంకు ఖాతా లేని కుటుంబం. కుటుంబంలో ఎవరి పేరు మీద ఒక్క బ్యాంక్ ఖాతా కూడా లేకపోతే వారు కూడా అర్హులే.
బంగారు కుటుంబం అనర్హతలు ఇవే
బంగారు కుటుంబం సంబంధించి అనర్హతలు ప్రభుత్వం పేర్కొంది. ఏ ఒక్కటి మీకు సరిపోలినా మీరు అనర్హులుగా ఉంటారు. [Bangaru Kutumbam Ineligible criteria]
- కుటుంబం మొత్తం భూమి 5 ఎకరాలకు మించి ఉంటే అనర్హులు. ఇందులో మాగాణి అంటే తడి భూమి రెండు ఎకరాల మించి ఉండరాదు.
- ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి గాని రిటైర్ పెన్షన్ పొందుతున్న వారు గాని ఉండకూడదు.
- ఇన్కమ్ టాక్స్ చెల్లింపు దారులు కూడా అనర్హులు
- నెలకు 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించరాదు, నాలుగు చక్రాల వాహనం కూడా ఉండరాదు.
బంగారు కుటుంబం మరియు మార్గదర్శి రిజిస్ట్రేషన్
బంగారు కుటుంబం కి సహాయం చేసే వారిని మార్గదర్శి అని ప్రభుత్వం పేరు పెట్టింది. మార్గదర్శి మరియు బంగారు కుటుంబం ఇద్దరు కూడా రిజిస్టర్ చేసుకునేందుకు ప్రభుత్వం ఒక వెబ్సైట్ ని కల్పించింది.
పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.
P4 Need Assessment Survey – జూలైలో మరో కొత్త సర్వే
మరోసారి మరికొన్ని ప్రశ్నలతో రాష్ట్ర ప్రభుత్వం జూలై నెలలో మరొక కొత్త సర్వే ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పలు ప్రశ్నలు అడిగి వాటిని తమ అప్లికేషన్ లో పొందుపరుస్తారు.
- P4 Need Assessment Survey App : download here
- P4 Need Assessment Survey User Manual: download here
|ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు క్లిక్ చేయండి.
P4 బంగారు కుటుంబం దత్తత చేసుకునే ప్రాసెస్
𝐒𝐭𝐞𝐩 𝟏 : కింద ఇచ్చిన లింక్ ద్వారా మొదట sign up అవ్వాలి. తదుపరి లాగిన్ అవ్వాలి.
𝐒𝐭𝐞𝐩 𝟐 : లాగిన్ అయిన తర్వాత “ADOPT FAMILIES” అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తదుపరి ఏ సచివాలయం పరిధిలో బంగారు కుటుంబం ను ADOPT చేసుకుంటారో ఆ జిల్లా & మండలం & సచివాలయం పేరు ఎంచుకుని SEARCH చేయాలి,తదుపరి అక్కడ సంబధిత సచివాలయ బంగారు కుటుంబాలు పేర్లు వస్తాయి లేదా search ఆప్షన్ Hof పేరు ఎంటర్ చేసి search చేసినచో వారి పేరు వస్తాయి, ఆ పేరు సెలెక్ట్ చేసుకున్న తదుపరి know more అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత Adopt family అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
𝐒𝐭𝐞𝐩 3 : తదుపరి మీ యొక్క వివరాలు ఇవ్వాలి, తదుపరి contribution&skills information అనే ఆప్షన్ దిగువన ఉన్న,
1. Skill Contribution
2. Financial contribution
3. Both
అనే ఆప్షన్స్ నందు మీరు ఏ విధముగా బంగారు కుటుంబం కీ సపోర్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ ఆప్షన్ ఎంచుకోవాలి.
𝐒𝐭𝐞𝐩 4 : తదుపరి check box మీద సెలెక్ట్ వేసుకుని “Take pledge” అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి.
𝐒𝐭𝐞𝐩 5 : చివరలో certificate download చేసుకుని Complete adoption మీద క్లిక్ చేయాలి.
𝐒𝐭𝐞𝐩 6 : ఆఖరిగా weekly Check ins /Monthly updates అనే ఆప్షన్ కీ సంబంధించి మీకు నచ్చిన విధముగా ఆప్షన్ ఎంచుకోవాలి.
Leave a Reply