సచివాలయాల్లోనూ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు

సచివాలయాల్లోనూ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యా పీఠానికి (APOSS) సంబంధించి పదోతరగతి, ఇంటర్ ప్రవేశాలు ఇకపై సచివాలయాల్లోనూ దరఖాస్తు మరియు పరీక్ష ఫీజులను చెల్లించే వీలును కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ కారణాల చేత స్కూలు మరియు కాలేజీలకు రోజూ వెళ్లలేని విద్యార్థులు ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు చేసుకుంటారు.

వచ్చే వారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి..

వయోజనుల్లో విద్య పట్ల ఆసక్తి పెంచేలా ప్రభుత్వం చర్యలు, ఏటా నవంబర్ నెలాఖరు దాకా అడ్మిషన్లు,  ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ఏటా నవంబరు నెలాఖరు వరకు కొనసాగుతోందని ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి  తెలిపారు.

ప్రవేశాలకు నమోదు ప్రక్రయ సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ నెలాఖరు వరకు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు.

ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ చదివే వారి కోసం ఈ ఏడాది నుంచి అధికారిక వెబ్సైట్లో ఆయా తరగతుల ఆన్లైన్ పాఠాల వీడియోలను ఉంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

Click here to Share

You cannot copy content of this page