దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక మార్పులు…ప్రభుత్వ బ్యాంక్‌లు.. తమ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిని అనుమతించనున్నాయి. త్వరలో ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేయనుంది. వారానికి ఐదు రోజుల పని పద్ధతి పై ఇంతకుముందే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ సూత్రప్రాయంగా ఒప్పుకున్నాయి.
ఫైవ్ డే వర్క్ వీక్‌కు బదులుగా బ్యాంక్ సిబ్బందికి రోజుకు 40 నిమిషాలు పనివేళలు పెరుగుతాయి. ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగులు రెండో, నాల్గోవ శనివారాలలో సెలవు తీసుకుంటున్నారు. ప్రతీ నెలా మొదటి, మూడో శనివారాల్లో బ్యాంక్‌లు తెరిచి ఉంటున్నాయి.
గతంలో ఈ ప్రతిపాదనలను తిరస్కరించిన ఐబీఏ తాజాగా సూత్రపాయంగా బ్యాంకు యూనియన్ల డిమాండ్లకు అంగీకరించడం గమనార్హం. ఇక అతి త్వరలో ఐదు రోజుల పని దినాలకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఇదే జరిగితే ఇకపై బ్యాంకు ఉద్యోగులకు తమ డిమాండ్ నెరవేరినట్లే అని చెప్పవచ్చు. ప్రభుత్వ రంగంలో ఈ మార్పులు వచ్చిన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఇదే అనుసరించునున్నట్లు సమాచారం.
Leave a Reply