ఇప్పటికే టమోటా ధరలు సామాన్యుడికి పట్టపగలే చుక్కలు చూపిస్తుండగా, టమోటా తో పాటు పోటీ పడుతూ ప్రతి ఏటా పెరిగేటటువంటి ఉల్లి ధరలు కూడా వచ్చే నెల మరింత ఘాటేక్కనున్నట్లు సమాచారం
రెట్టింపు అవ్వనున్న ప్రస్తుత ధరలు
దేశవ్యాప్తంగా అన్ని కూరగాయల ధరలు ప్రస్తుతం మండిపోతు ఉన్నాయి ముఖ్యంగా టమాటో ధరలు అయితే కొన్ని మార్కెట్లలో ఇప్పటికే 200 పైగా అమ్ముడు అవుతుంది. ఏదో నాసిరకం లేదా రెండో రకం టమాటాలు మాత్రమే సామాన్యులకు 150 లోపు అందుబాటులో ఉన్నాయి.
అయితే ఇప్పటికే పెరిగిన నిత్యవసర సరుకులు మరియు కూరగాయల ధరలతోటి పెంబేలు ఎత్తుతున్న జనం పై మరో పిడుగు లాంటి వార్తను క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ తెలిపింది.
ఉల్లి ధరలు ఈ నెలాఖరి వరకు పెరుగుతూ సెప్టెంబర్ నాటికి 60 నుంచి 70 రూపాయలు వరకు చేరవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. అయితే 2020 సంవత్సరం నాటి గరిష్ట ధరల కంటే కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉన్నట్లు మాత్రం పేర్కొంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లి సాగు తగ్గిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలు సైతం కొంత నష్టాన్ని మిగిలించగా సరఫరా డిమాండ్ సమతోల్యం దెబ్బతింది. దీంతో ఆగస్టు చివరినాటికి ఉల్లి ధరలు పెరిగి వచ్చే నెల నాటికి గరిష్ఠానికి చేరనున్నట్లు క్రిసిల్ మరియు ఇతర వ్యాపార సంస్థలు పేర్కొన్నాయి. అక్టోబర్ లో తిరిగి ఖరీఫ్ పంట చేతికి వచ్చిన తర్వాతే ఉల్లిగడ్డల ధరలు దిగి వచ్చే అవకాశం ఉందని క్రిసిల్ పేర్కొంది. ఇటీవల నేషనల్ కమోడిటీస్ మేనేజ్మెంట్ సర్వీసేస్ NCML సీఈఓ సంజయ్ గుప్తా కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.
ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఇదే పరిస్తితి
ఇప్పటికే జులైలో అత్యధిక ధరలు నమోదు అవుతున్నటువంటి కూరగాయలు, నిత్యవసర సరుకులు, బియ్యం ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో కూడా ఇదే స్థాయి లో కొనసాగే అవకాశం ఉంది.
ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ నెలలో టమోటా ధరలు 300 కి చేరినా ఆశ్చర్యం లేదని ఆయా వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Leave a Reply