ఇటీవల బీసీలకు లక్ష రూపాయల పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
త్వరలో మైనారిటీలకు లక్ష రూపాయలు
బీసీలకు లక్ష రూపాయల పథకం తరహాలోనే మైనారిటీలకు కూడా త్వరలో లక్ష రూపాయల స్కీం ప్రారంభించనున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులను అందిస్తామని తెలిపారు.
ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి విధివిధానాలను వారంలోపు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
ఇటీవల బీసీలకు లక్ష రూపాయల పథకం తోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద బీసీలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించి పంపిణీ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇదే తరహాలో ప్రస్తుతం ఈ పథకానికి కూడా శ్రీకారం చుట్టబోతుంది.
బీసీలకు లక్ష రూపాయల పథకానికి సంబంధించి ఐదు లక్షల పైగా దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. మైనార్టీలు అధికంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీలకు లక్ష రూపాయలు పథకం కూడా మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. బీసీలకు లక్ష రూపాయలు పథకం తరహాలోనే దీనికి కూడా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది.
Leave a Reply