BC లకు లక్ష రూపాయలు.. మొదటి విడత లో వీరికే అమౌంట్

BC లకు లక్ష రూపాయలు.. మొదటి విడత లో వీరికే అమౌంట్

బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం పథకానికి సంబంధించి తొలి విడత లో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వనున్నారో ప్రభుత్వం ప్రకటించింది.

జూలై 15 న తొలి విడత అమౌంట్ వీరికే

తొలి విడత అర్హుల ఎంపికలో నిరుపేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

అర్హత పొందిన వారి జాబితాలను వెబ్సైట్ తో పాటు పంచాయతీ కార్యాలయాల్లో ఉంచాలని తెలిపింది. ఎంపికైనవారికి వరుస క్రమంలో ప్రతి నెలా 15న సాయం అందించాలని సూచించింది. ఆ సొమ్ముతో లబ్ధిదారులు పరికరాలు కొనుగోలు చేశాక నెలరోజుల్లో పరిశీలించాలని తెలిపింది.

ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు ఇవే

బీసీలకు లక్ష పథకానికి సంబంధించి జూన్ 20 వరకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించడం జరిగింది.

ఈ పథకానికి సంబంధించి 5.28 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎక్కువగా రజక, నాయి బ్రాహ్మణ, కుమ్మరి, వడ్డెర, విశ్వ బ్రాహ్మణ కులాల నుంచి అప్లికేషన్స్ వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇందులో 3.80 లక్షల మంది పురుషులు, 1.48 లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు.

ఇక ఈ పథకానికి సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో పూర్తి విధానం కింది లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి.

జూలై 15న అమౌంట్ విడుదల

జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల జాబితాలను పరిశీలించి జులై 5 న కలెక్టర్లు అర్హుల జాబితాను ప్రభుత్వానికి అందించినట్లు మంత్రి గంగుల తెలిపారు. ఈ విధంగా అర్హత పొందిన వారికి జూలై 15న చెక్కులు పంపిణీ చేస్తామని ప్రకటించారు.

ఇది చదవండి: తొలి దశలో బీసీలకు లక్ష పథకానికి అర్హత ఉన్న కులాల జాబితా ఇదే

You cannot copy content of this page