తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కులవృత్తులు మరియు చేతి వృత్తులపై ఆధారపడుతున్నటువంటి బీసీ కులాల వారికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ఎటువంటి పూచీకత్తు లేకుండా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 9 న ఈ పథకాన్ని సీఎం ప్రారంభిస్తారు.
బీసీలకు లక్ష రూపాయల పథకం అర్హతలు
- దరఖాస్తుదారులు బీసీ కులానికి చెందిన వారై ఉండి కులవృత్తులు లేదా చేతివృత్తులపై ఆధారపడిన వారై ఉండాలి.
- గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం 1.5 లక్షల మించకూడదు, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల ఆదాయం మించకూడదు
- గత ఐదేళ్లలో వివిధ పథకాల ద్వారా 50 వేలు మించి లబ్ది పొందిన వారు అనర్హులు
- 18 నుంచి 55 ఏళ్ల లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు
ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి? లాస్ట్ డేట్ ఎప్పుడు
ఈ పథకానికి సంబంధించి అర్హులైన బీసీ కుల వృత్తుల వారు కింద ఇవ్వబడిన ఆన్లైన్ లింక్ ద్వారా apply చేయవచ్చు.
అప్లికేషన్ చివరి తేదీ : 20 జూన్ 2023
అప్లై చేయి విధానం
Official Application link : Application link [అప్లై చేయు లింక్]
Step 1. ముందుగా లబ్ది దారుని అడ్రస్ వివరాలను ఎంటర్ చేయాలి
Step 2. తర్వాత ఆధార్ మరియు వ్యక్తిగత వివరాలు ఆధార్ ప్రకారం నమోదు చేయాలి. ఇందులోనే క్యాస్ట్ సర్టిఫికెట్ వివరాలు కూడా నమోదు చేయాలి.
Step 3. తర్వాత Purpose of Financial Assistance దగ్గర మీరు ఈ సహాయం ద్వారా వచ్చే అమౌంట్ ఎందుకు ఉపయోగిస్తారో ఎంచుకోండి. తర్వాత మీ బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేసి ఫోటో అప్లోడ్ చేయండి.
చివరగా రెండు టిక్ బాక్స్ లో క్లిక్ చేసి preview చూసుకొని వివరాలు సరిగా ఉంటే సబ్మిట్ చేయండి
Application link
Leave a Reply