ఠంచన్ గా ఒకటో తేదీనే అవ్వాతాతలకు పింఛన్ల డబ్బులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు ముందే గ్రామ వార్డు సచివాలయాల వారీగా నిధులు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 65,78,849 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులు, వివిధ రకాల చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మొత్తం రూ.1,813.60 కోట్ల మొత్తాన్ని శనివారమే ఆయా సచివాలయాల ఖాతాల్లో జమ చేసింది.
నేడు ఆదివారం సెలవు కావడంతో రేపు సాయంత్రానికే దాదాపు అన్నిచోట్ల ఆయా సచివాలయాల ఉద్యోగులు బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసి, వలంటీర్ల వారీగా అందచేశారు.
పెన్షన్ పంపిణీ కి సంబంధించిన సమాచారం
కులం, మతం, పార్టీలకు అతీతంగా, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని, సామాజిక పింఛన్లకు ఇచ్చే నగదును ఏటా పెంచుతామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెర వేరుస్తున్నారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువుల జీవితాల్లో వెలుగులు నింపేలా వైఎస్సార్ పింఛన్ కానుక పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఇంకా ఎవరైనా అర్హులు ఉండి, దరఖాస్తు చేసు కుంటే వారికి సైతం పింఛన్లు మంజూరు చేస్తు
న్నారు. ఒకటో తేదీ తెల్లవారుజాము నుంచి ఐదో తేదీలోగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వలంటీర్లు పింఛన్లు అందజేస్తున్నారు. ఆయా పింఛన్లకు ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు లబ్దిదారులుగా గుర్తిస్తున్నారు.
అక్టోబర్ నెలలో కొత్తగా మంజూరు అయ్యి మిస్ అయిన పెన్షన్లకు సంబంధించిన సమాచారం
- కొన్ని పెన్షన్ అప్లికేషన్స్ వివిధ టెక్నికల్ కారణాలవలన వెరిఫికేషన్ కు రావడం జరగలేదు అటువంటి పెండింగ్ అప్లికేషన్స్ MPDO / మునిసిపల్ కమీషనర్ గార్ల మొబైల్ అప్ కు వెరిఫికేషన్ కు ఇవ్వడం జరుగుతుంది.
- ఈ పెండింగ్ అప్లికేషన్స్ అన్నీ కూడా 2వ తారీకు సాయంత్రానికి వెరిఫికేషన్ పూర్తి చేసిన అర్హులైన పెన్షన్ దారులందరికి ౩వ తారీకున అమౌంట్ రిలీజ్ చెయ్యడం జరుగుతుంది.
- అర్హులైన ప్రతి పెన్షన్ దారునికి పెన్షన్ అమౌంట్ రిలీజ్ చెయ్యడం జరుగుతుంది. ఈ విషయం అన్ని గ్రామ / వార్డు సచివాలయముల వారికి తెలియ జేయవల్సినదిగా కోరడమైనది.
Leave a Reply