ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి

,
ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (NREGA) పనులకు హాజరయ్యే కూలీల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానాన్ని కేంద్రప్రభుత్వం తప్పనిసరి చేసింది. అలాంటి ఖాతాలకే ఇక వేతనాలు జమ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్రంలో కూలీలకు సంబంధించిన అత్యధిక బ్యాంకు ఖాతాలకు ఇప్పటికే ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. మిగిలిన కూలీలబ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ జిల్లా అధికారులను ఆదేశించింది.

You cannot copy content of this page