దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల (National Highways) పై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వసూలు చేసే టోల్ చార్జీలు ఏప్రిల్ ఒకటి నుంచి భారీగా పెరగనున్నాయి. ఈ చార్జీల పెంపు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది.
రోడ్ల నిర్వహణకు, మరమ్మత్తులకు ఈ చార్జీలను వసూలు చేస్తారు. ఇందుకు సంబంధించి ప్రతి ఏటా ఏప్రిల్ 1 నుంచి చార్జీల పెంపును నేషనల్ హైవే అథారిటీ లిమిటెడ్ పెంచుకుంటూ వస్తుంది..
ఈసారి ఎంత చార్జీలను పెంచారు
గత సంవత్సరం వివిధ కేటగిరీల వాహనాలకు సంబంధించి ఏకంగా 8 శాతం నుంచి 15 శాతం వరకు ధరలు పెంచిన NHAI. ఈసారి 5.50 శాతం వరకు పెంచడం జరిగింది. అంటే గత రెండు ఏళ్లలో సుమారు 15 నుంచి 20 శాతం టోల్ చార్జీల పేరుతో వాహనదారులపై వడ్డించింది.
ఉదాహరణకు హైదరాబాద్ విజయవాడ పంతంగి టోల్
ప్లాజాను తీసుకుంటే, గతేడాది కారు/జీపు/వ్యాన్
కేటగిరీలో చార్జీని రూ.80 నుంచి రూ.90కి అంటే రూ.10 పెంచింది. ఈసారి రూ.90 నుంచి రూ.95కు అంటే రూ.5 పెంచింది. అంటే ఏడాది కాలంలో 15 రూపాయలు పెరిగినట్లే. NH 62 పై హైదరాబాద్ నుంచి విజయవాడ కు 24 గంటల్లో వెళ్లి రావాలంటే 465 టోల్ చెల్లిస్తున్న వాహనదారులు ఇకపై 490 చెల్లించాలి. అంటే 25 రూపాయలు అధికంగా చెల్లించాల్సి వస్తుంది.
అంతేకాకుండా ఈ ఏడాది జాతీయ రహదారులపై మరిన్ని టోల్ ప్లాజాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం వలన వాహనదారులకు మరింత ఆర్థిక భారం పడనుంది. గత ఆర్థిక సంవత్సరం ఈ టోల్ చార్జీల వలన కేంద్ర ప్రభుత్వం 1820 కోట్లు వసూలు చేయగా ఈసారి వసూళ్లు గణనీయంగా 2000 కోట్లు దాటే అవకాశం కనిపిస్తుంది..
కీసర టోల్ ప్లాజా వద్ద చార్జీలు ఇలా (ఉదాహరణ కు)
Car/Jeep/Van – single trip 55 , up-down 70 ఇకపై ఇది 74 వరకు పెరుగుతుంది.
LCV 95 కి సుమారు 100 వరకు పెరుగుతుంది
తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్ నుంచి విజయవాడకి ప్రయాణం చేయాలంటే నాలుగు టోల్ ప్లాజాలు దాటాలి.. ఈ మేరకు వాహనదారులకు మరింత భారం పడుతుంది.
అంతేకాకుండా 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి వారికి డైలీ పాసులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ డైలీ పాసుల రేటు కూడా పెరిగింది.
దేశంలో కొన్ని ప్రముఖ హైవేలలో ఒకటి ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే, ఈ రూట్ లో అయితే ఏకంగా 18 శాతం టోల్ చార్జీలు పెరగడం గమనార్హం.
ఇది చదవండి: ఇటీవల పెళ్ళైన వారికి వైఎస్సార్ కల్యాణమస్తు సంబంధించి కీలక అప్డేట్
Leave a Reply