ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏటీఎం కార్డు సైజులో ఉండే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ కొత్త స్మార్ట్ రేషన్‌కార్డులో క్యూఆర్ కోడ్, ఇతర సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయని నాదెండ్ల మనోహర్ తేల్చి చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీ సహా వివిధ అంశాలపై ఏపీ సచివాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాకు వివరించారు. ఈ స్మార్ట్ కార్డులో కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయని.. అది రేషన్ కార్డుగా కాకుండా ఫ్యామిలీ కార్డుగా ఉంటుందని తెలిపారు.
ఇక రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు సంబంధించి కూడా మంత్రి నాదెండ్ల వివరించారు. రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యులను జోడించడం.. ఉన్నవారి పేర్లను తొలగించడం.. స్ప్లిట్ కార్డులు అప్లై చేసుకునేందుకు ఆప్షన్లు ఇస్తామని మంత్రి తెలిపారు. ఈ-కేవైసీ పూర్తైతే ఎంతమందికి రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని మనోహర్ చెప్పారు. ఈ నెలాఖరులోగా ఈ-కేవైసీ పూర్తి చేస్తామని.. ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. మరోవైపు.. మంగళవారం నుంచే దీపం-2 రెండో విడత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభమైనట్లు మంత్రి వివరించారు.
ష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు తమకు నచ్చిన మిల్లుకు తీసుకువెళ్లి తమ ధాన్యాన్ని విక్రయించుకోవచ్చని వెల్లడించారు. అదే సమయంలో వాట్సాప్ ద్వారా కూడా రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించినట్లు పేర్కొన్నారు. వాట్సాప్ ద్వారా 16 వేల మంది రైతులు ఇప్పటివరకు ధాన్యాన్ని విక్రయించారని తెలిపారు. రైతులకు గన్నీ బ్యాగుల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రైతుకు భరోసా కల్పించేలా ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల అకౌంట్లలో నగదు జమ చేసినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం కన్నా 20 శాతం అధికంగా తాము ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు.
Leave a Reply