ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి కొత్త రూల్స్.. ఈ 4 డాక్యుమెంట్లు తప్పనిసరి

ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి కొత్త రూల్స్.. ఈ 4 డాక్యుమెంట్లు తప్పనిసరి

కొత్త ఆధార్ కార్డును పొందాలనుకుంటే లేదా పాత ఆధార్‌లో పేరు, చిరునామా లేదా ఫోటోను మార్చాలనుకుంటే, ఇప్పుడు కొత్త నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. 2025-26 సంవత్సరానికి ఆధార్ అప్డేట్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ల కొత్త జాబితాను యూఐడీఏఐ విడుదల చేసింది.

ఆధార్ కార్డ్ అప్డేట్

కొత్త ఆధార్ కార్డును పొందాలనుకుంటున్నారా? పాత ఆధార్‌లో పేరు, చిరునామా లేదా ఫోటోను మార్చాలనుకుంటున్నారా? కొత్త నిబంధనలను జాగ్రత్తగా చూడాలి. 2025-26 సంవత్సరానికి ఆధార్ అప్డేట్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ల కొత్త జాబితాను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) విడుదల చేసింది.

పొరపాటున ఒకరి పేరు మీద రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆధార్ నంబర్లను సృష్టించినట్లయితే, మొదట జారీ చేసిన ఆధార్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని యూఐడీఏఐ స్పష్టం చేసింది. మిగతా అన్ని ఆధార్ నెంబర్లు రద్దవుతాయి. ఆధార్ కోసం నాలుగు డాక్యుమెంట్లు అవసరం

1. ఐడెంటిటీ ప్రూఫ్ : దీని కింద, మీరు పాస్‌పోర్ట్, పాన్ కార్డు (చెల్లుబాటు అయ్యే ఇ-పాన్ కార్డ్), ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వం / ప్రభుత్వ సంస్థ జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు, నరేగా జాబ్ కార్డు, పెన్షనర్ గుర్తింపు కార్డు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం / ఎక్స్-సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ కార్డు, ట్రాన్స్జెండర్ ఐడి కార్డును డాక్యుమెంట్‌గా చూపించవచ్చు.

2. అడ్రస్ ప్రూఫ్ : విద్యుత్ / నీరు / గ్యాస్ / ల్యాండ్‌లైన్ బిల్లు (ఇది 3 నెలల కంటే తక్కువ), బ్యాంక్ పాస్‌బుక్ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, అద్దె ఒప్పందం(రిజిస్టర్డ్), పెన్షన్ డాక్యుమెంట్, రాష్ట్ర / కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని చిరునామా రుజువు కోసం ఉపయోగించవచ్చు.

3. బర్త్ సర్టిఫికేట్ : స్కూల్ మార్క్ షీట్, పాస్‌పోర్ట్, మీ పుట్టిన తేదీ రాసిన పెన్షన్ డాక్యుమెంట్, పుట్టిన తేదీతో కూడిన రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ సర్టిఫికేట్ ఉపయోగించవచ్చు.

4. సంబంధానికి రుజువు (అవసరమైతే).

కొత్త నిబంధనలు ఎవరికి?

భారతీయ పౌరులు, ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు), 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు, దీర్ఘకాలిక వీసాలపై భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులు ప్రాంతీయ కార్యాలయంలో డాక్యుమెంట్ చూపించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీఐ కార్డుదారులు తమ పాస్‌పోర్ట్, వీసా, పౌరసత్వ ధృవీకరణ పత్రం లేదా ఎఫ్ఆర్ఆర్ఓ నివాస అనుమతిని చూపించాలి. ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకోండి. యూఐడీఏఐ 2026 జూన్ 14 వరకు ఉచిత ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్స్‌ను అందుబాటులో ఉంచింది

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page