ఏపీ లో ఆగస్ట్ నుంచి కొత్త రేషన్ కార్డులు

ఏపీ లో ఆగస్ట్ నుంచి కొత్త రేషన్ కార్డులు

ఆంధ్రప్రదేశ్ లో పాత రేషన్ కార్డు కలిగిన వారికి మరియు కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్ న్యూస్. ఆగస్టు నెలలో ప్రస్తుతం ఉన్నటువంటి పాత రేషన్ కార్డులు అన్నిటి స్థానంలో స్మార్ట్ కార్డు రూపంలో కొత్త రేషన్ కార్డులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొత్త రేషన్ కార్డులను కూడా ఇకపై స్మార్ట్ కార్డ్ రూపంలోనే జారీ చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఉన్నటువంటి 1 46 కోట్ల పాత కార్డులను కొత్త కార్డుల తోటి భర్తీ చేయడంతో పాటు కొత్తగా జారీ చేసేటటువంటి 2 లక్షల రేషన్ కార్డులను కూడా వచ్చే నెలలో ప్రభుత్వం స్మార్ట్ కార్డు రూపంలోనే జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

స్మార్ట్ కార్డు రూపంలో జారీ చేసే కొత్త రేషన్ కార్డు లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దానిని స్కాన్ చేయగానే రేషన్ కార్డు వివరాలు మరియు కుటుంబ సభ్యుల వివరాలు మొత్తం ప్రత్యక్షమవునున్నాయి. ఇందులో ప్రభుత్వ అధికారిక చిహ్నం మరియు లబ్ధిదారుల ఫోటో మాత్రమే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాజకీయపరంగా ఎటువంటి చిహ్నాలు గాని నేతల ఫోటోలు గాని ఇందులో ఉండవు.

ఇక రేషన్ కార్డుకు సంబంధించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కేవైసీ పూర్తిచేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.  మీయొక్క రేషన్ కార్డు కేవైసీ పూర్తి అయిందా లేదా మరియు కేవైసీ పూర్తిచేసుకునే పూర్తి విధానం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Click here to Share

One response to “ఏపీ లో ఆగస్ట్ నుంచి కొత్త రేషన్ కార్డులు”

  1. K.Lakshminarasaiah Avatar
    K.Lakshminarasaiah

    My full name: Krishnamurthy Lakshmi narasaiah

    Adhar Card: K.L.Narasaiah
    PAN CARD. Krishnamurthy Lakshmi Narasaiah
    Land records : K.L.Narasaiah

    Please advice pricess to maintain common name in all the record

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page