తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ తెలిపింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త రేషన్ కార్డుల నమోదుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.
ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ ఇప్పటికే ఆముదం తెలిపింది. ఈనెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులో ఎంపిక మరియు జారీ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. మానవీయ కోణంలో ఆలోచించి రేషన్ కార్డుల జారీ ఉండాలని ఇప్పటికే మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు.
జనవరి 26వ తేదీన రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మరియు కొత్త రేషన్ కార్డుల జారి కలిపి మొత్తం నాలుగు పథకాలు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది.
మొత్తంగా ఈ నాలుగు పథకాలకు 45 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఇప్పటికే డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క వెల్లడించారు.
కొత్త రేషన్ కార్డు దరఖాస్తు విధానం [ New Ration Card Application in Telangana]
తెలంగాణలో కొత్త రేషన్ కార్డు పొందాలంటే తెలంగాణ శాశ్వత నివాసిగా అయి ఉండి ఇంటింటి సర్వేకి వచ్చినప్పుడు మీ వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.
మీ ఆదాయము మరియు ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి మీకు కొత్త రేషన్ కార్డు మంజూరు చేయటం జరుగుతుంది.
ఈనెల 26 నుంచి ఇంటింటి సర్వే నిర్వహించే అవకాశం ఉంది.
అయితే లబ్ధిదారులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు, స్థానికంగా శాశ్వత నివాసి అయిన ద్రువ పత్రాలు కలిగి ఉండాలి.
Leave a Reply