అన్ని అర్హతలు కలిగి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురును అందించింది.
త్వరలోనే 1.67 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం 1.46 కోట్ల మంది పేదలకు ప్రతినెలా 2.11
లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు.
ఇందుకోసం నెలకు రూ.846 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు
చెప్పారు.దీనికి అదనంగా ఏటా రూ.200 కోట్లతో ఫోలిక్ యాసిడ్, బి-12 విటమిన్, ఐరన్తో కూడిన నాణ్యమైన ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
ఒక్కో లబ్ధిదారుడికి జాతీయ ఆహార భద్రత చట్టం కింద ప్రస్తుతం నెలకు 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రజల ఆహారపు అలవాట్లు మారుతుండటంతో.. రేషన్ షాపుల్లో పీడీఎస్ ద్వారా బియ్యం బదులు పోషక విలువలున్న ఇతర ఆహార ధాన్యాలు రాగులు, జొన్నలు కూడా పంపిణీ చేస్తున్నారు.
రేషన్ కార్డులు పొందిన వారికి బియ్యంతో సమానంగా రాగులు, జొన్నలను ఉచితంగానే పంపిణీ చేస్తారు.
ఇవే కాకుండా రేషన్ షాపుల్లో పౌరసరఫరాల శాఖ కిలో గోధుమ పిండి ప్యాకెట్ ధరను రూ.16లకే పంపిణీ చేస్తున్నారు.
కొత్త రైస్ కార్డుకు ఎలా అప్లై చేయాలి?
గ్రామ వార్డు వాలంటీర్లు ఇప్పటి వరకు రైస్ కార్డు e-KYC ను AEPDS మొబైల్ అప్లికేషన్ లో చేసే వారు. కానీ గత కొంత కాలం గా రైస్ కార్డు లు సచివాలయం లో ఆన్లైన్ అవుతున్నప్పటికి eKYC చేయు మొబైల్ అప్లికేషన్ AEPDS సరిగా పని చెయడం లేదని అంటున్నారు. దీంతో కొత్తగా GSWS డిపార్ట్మెంట్ వారు రైస్ కార్డుల eKYC కొరకు వాలంటీర్లు హౌస్ హోల్డ్ మాపింగ్ కోసం ఉపయోగిస్తున్న GSWS Volunteers (గతం లో గ్రామ వార్డు వాలంటీర్) లో కొత్తగా ఆప్షన్ ఇస్తున్నారు. మీ వాలంటీర్ ను సంప్రదించి.. ప్రోసెస్ చేసుకోవాలి.
Leave a Reply