జనవరిలో కొత్త రేషన్ కార్డులు..డిసెంబర్ దరఖాస్తుల స్వీకరణ

జనవరిలో కొత్త రేషన్ కార్డులు..డిసెంబర్ దరఖాస్తుల స్వీకరణ

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే పనిలో నిమగ్నమయ్యింది. తాజా మరో తీపి కబురును పేదలకు అందించింది.

ఇప్పటికే దీపావళి పండుగ సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేసిన సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది.

అలాగే పాత రేషన్ కార్డులకు బదులుగా కొత్త రేషన్ కార్డులను అందించాలని నిర్ణయం తీసుకొంది. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది.

తొలుత కొత్తగా పెళ్లైన వారితో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కార్డులలో మార్పులు,చేర్పులకు అవకాశం కల్పించనుంది.

ఫిబ్రవరి నాటికి కొత్త కార్డులజారీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. అలాగే ప్రస్తుతం ఉన్నకార్డుల స్థానంలో రీ డిజైన్ కార్డులతో పాటు కొత్త లబ్ధిదారులందరినిగుర్తించి వారికి కార్డులను జారీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలను జారీచేసింది.

డిసెంబర్ 2నుంచి కొత్త కార్డులకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. సచివాలయాల వారీగా రేషన్ కార్డులకు దరఖాస్తులను స్వీకరిస్తారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1 కోటి 48 లక్షల తెల్ల రేషన్కార్డులు ఉన్నాయి. వీటిల్లో 90 లక్షల కార్డులు జాతీయ ఆహార భద్రతచట్టం కింద కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.

ఈ కార్డులకు మాత్రమేకేంద్రం ఉచితంగా బియ్యం, తక్కువ ధరకు కందిపప్పు, పంచదారఇతర సరుకులు అందిస్తుంది. మిగిలిన కార్డులకు అందిస్తున్న ఉచితబియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, ఇతర సరుకులకు అయ్యేరాయితీలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.

ఈ కార్డులను కూడాజాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని చాలా కాలంగా కోరుతున్నా ఆశించిన స్పందనకేంద్రం నుంచి లేకపోవడంతో రాష్ట్రం ఆ ఖర్చును భరిస్తోంది. ఈనేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వంపై ఎటువంటి అదనపు భారంపడకుండా 1.5 లక్షలకు పైగా పేద కుటుంబాలకు వచ్చే ఏడాదిజనవరిలో కొత్త రేషన్కార్డులు జారీ చేసేందుకు పౌరసరఫరాల శాఖప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం కూడా ఆమోద ముద్రవేసింది.

పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు

అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల రంగుమార్పు జరిగింది. అలాగే బియ్యం కార్డులు సైతం జారీ చేశారు. రేషన్కార్డులపై వైఎస్ జగన్, రాజశేఖర్ రెడ్డి ఫొటోలు ముద్రించిలబ్ధిదారులకు అందజేశారు.

ఇప్పుడు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఎవరి ఫోటోలు లేకుండా రాజ ముద్రతో వివిధ పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడు రేషన్ కార్డుల డిజైన్లు మార్చాలని నిర్ణయం తీసుకుంది. లేత పసువు రంగు కార్డుపై ప్రభుత్వ అధికారిక చిహ్నం ఉన్న రేషన్ కార్డు నమూనాను పౌరసరఫరాల శాఖ ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది.

పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్ర తో ఎలా పంపిణీ చేస్తున్నారో అదే తరహాలో రేషన్ కార్డులను జారీ చేయనున్నారు.

పెండింగ్ భారీగా దరఖాస్తులు

ప్రభుత్వం వద్ద కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు సహా మార్పుచేర్పులు కోసం భారీగా కార్డులు పెండింగ్ లో ఉన్నాయి.

మొత్తంగా 3.36 లక్షలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వం వద్ద వెండింగ్లో ఉన్నాయి. వీటిలో కొత్త రేషన్ కార్డుల కోసం 30,611 దరఖాస్తులు,కార్డుల స్లిట్ కోసం 46,918 దరఖాస్తులు, సభ్యులను యాడ్ చేసేందుకు 2,13,007 దరఖాస్తులు, తొలగింపు కోసం 36,588,అడ్రస్ మార్పు కోసం 8,263, సరెండర్ కోసం 685 దరఖాస్తులు అందాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల వినియోగంపై పౌర సరఫరాల శాఖ సమీక్షలు నిర్వహిస్తుంది. పౌరసరఫరాల శాఖ డేటా ఆధారంగా రాష్ట్రంలోని 17,941 అంత్యోదయ అన్న యోజన కార్డుదారులు, మరో 1,36,420 పీహెచ్పైచ్ కార్డుదారుల లబ్ధిదారులు గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోవడం లేదని అధికారులు గుర్తించారు.

ఈ కార్డులు తొలగిస్తే ఏడాదికి రూ.90 కోట్ల వరకు ఆదా అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. వీటి స్థానంలో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయవచ్చని, దీంతో ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారంపడదని ప్రభుత్వానికి పౌరసరఫరాల శాఖ నివేదిక ఇచ్చింది.

అంతేకాకుండా దాదాపు 1.60 లక్షల మందికి కొత్త కార్డులు జారీ చేసే వెసులుబాటు ఉంటుందని అంచనా వేస్తోంది. వెండింగ్ దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హులైన పేదలందరికీ కొత్తరేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది.

ఇప్పటికే టీడీపీ చేపట్టిన ప్రజా వేదిక, యువనేత నారా లోకేష్ ప్రజా దర్బార్ కు రేషన్కార్డుల కోసం భారీగా వినతులు అందాయి. వీరిలో అర్హులను ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఇక సచివాలయలో వెండింగ్ దరఖాస్తులకు మోక్షం కలుగనుంది.

జనవరిలో సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్న జన్మభూమి -2 కార్యక్రమంలో కొత్తరేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page